సుడిగాడు 2 వేరే.. క‌న్ఫ్యూజ్ అవ్వొద్దు!

Update: 2018-09-05 14:40 GMT
సుడిగాడు నా కెరీర్ 53వ సినిమా. సిల్లీఫెలోస్ 54వ సినిమా. ఇటీవ‌ల ఆఫ‌ర్లు వ‌చ్చినా వ‌దిలేశాను. ఏడాదిలోనే ఐదు సినిమాలు తిర‌స్క‌రించాను.  డబ్బు కోసం  - సంఖ్య కోసం కాకుండా.. క్వాలిటీ కోసం సినిమాలు చేయాల‌ని తెలుసుకున్నాన‌ని రియ‌లైజేష‌న్ గురించి మాట్లాడారు అల్ల‌రి న‌రేష్‌. అలానే కామెడీ, ఎమోష‌న్ ఒకేదాంట్లో పలికించేయ‌కూడ‌దు. ఎమోష‌న్ సీన్స్‌ లో పూర్తిగా అలానే ఉండాల‌ని గ్ర‌హించాను. ఆ మార్పుల‌ను అనుభ‌వ పూర్వ‌కంగా అమ‌ల్లో పెడుతున్నాన‌ని అన్నారు. నిజ‌మే అల్ల‌రి న‌రేష్ న‌టించిన `ల‌డ్డు బాబు` ఫ్లాప‌వ్వ‌డం వెన‌క కార‌ణం కూడా అదే. స‌హ‌జంగా న‌రేష్‌ ని క‌మెడియ‌న్ గానే చూస్తారు జ‌నం. ఆ అంచ‌నాల‌తోనే థియేట‌ర్ల‌కు వ‌స్తారు. కానీ ఆ సినిమాలో ఎమోష‌న్ పండించ‌డంతో జ‌నం తిర‌స్క‌రించారు. ఈ సినిమా కోసం రోజూ వేకువ‌ఝాము 4 గంట‌ల‌కు మేక‌ప్ ప్రారంభిస్తే ఆరుగంట‌ల పాటు కేవ‌లం మేక‌ప్‌ కే కేటాయించేవాడిన‌ని - ఎంతో శ్ర‌మిస్తే ఫ‌లితం బాధించింద‌ని న‌రేష్ తెలిపారు.

ఇక‌పోతే సిల్లీఫెలోస్ రిలీజ్ ప్ర‌మోషన్స్‌ లో మాట్లాడిన న‌రేష్ త‌న ద‌ర్శ‌కుడు భీమ‌నేని సెంటిమెంటు గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తి చెప్పారు. డైరెక్ట‌ర్‌ భీమ‌నేనికి `సు` సెటిమెంట్ ఉంది. అందుకే తాజా చిత్రానికి సుడిగాడు 2 అని పెట్టాలనుకున్నాం. కానీ నా సినిమా సుడిగాడుని ఊహించుకొని సినిమాకి వస్తారు. కానీ ఇది కొత్త క‌థ‌తో చేస్తున్న‌ కొత్త సినిమా. దాంతో ఏ సంబంధం లేనిది. అందుకే ఓ కొత్త టైటిల్ నే పెట్టాలనుకున్నాం. అలా సిల్లీ ఫెలోస్ ఓకే చేశాం. ఇక సుడిగాడు 2 మూవీ వేరే ప్రాజెక్టు. త‌మిళంలో విజ‌యం సాధించిన త‌మిళ‌ప‌దం 2 సినిమాకి రీమేక్ గా చేస్తాం. టైమ్ ప‌డుతుందింకా. అయితే అదే ఇదీ.. ఇదే అదీ అని చాలామంది క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. అలా అవ్వొద్దు అని న‌రేష్ తెలిపారు.

సుడిగాడు 2 చేయాల‌ని పంపిణీదారులే అడుగుతున్నారు. ఒక‌వేళ చేస్తే దాన్ని మించి చెయ్యాలి అనీ తెలిపారు న‌రేష్‌. కానీ ఈసారి స్పూఫ్‌ లు చేయాల‌నుకోవ‌డం లేదు. న‌ట‌శిక్ష‌ణ‌లో నేర్చుకున్న మొద‌టి లెస్స‌న్‌... ఇమిటేషన్ ఈజ్ నాట్ యాక్టింగ్. అందుకే నాకంటూ ఓ స్టైల్ ఉండాల‌ని వాటిని అవాయిడ్ చేస్తున్నానని అన్నారు.



Tags:    

Similar News