హారర్ కామెడీ సినిమాలు ఎన్ని వచ్చినా.. ఇంకా వాటికి డిమాండ్ ఎంతగా ఉందో.. మేకింగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. కామెడీ హీరో అల్లరి నరేష్ తొలిసారిగా ఈ జోనర్ లో ప్రయత్నిస్తూ ఇంట్లో దెయ్యం.. నాకేం భయం అనే టైటిల్ పై మూవీని చేస్తుండగా.. రీసెంట్ గా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
కాన్సెప్ట్ కొత్తగానో.. మరీ ఎప్పుడూ చూడనిది తెలియనిది కాకపోయినా.. అల్లరి నరేష్-రాజేంద్రప్రసాద్ ల ప్రెజెన్స్ తో.. ఇంట్లో దెయ్యం నాకేం భయం రేంజ్ ఒక్కసారిగా మారిపోయినట్లుగా ఉంది. ఇద్దరు అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ పక్కపక్కనే ఉండడం.. బాగా కలిసొచ్చింది. ఎక్కువభాగం కామెడీకి.. చివర్లో దెయ్యానికి ట్రైలర్ లో స్పేస్ ఇచ్చారు. ముగింపులో అల్లరి నరేష్ కి కూడా దెయ్యం గెటప్ వేసేయడం.. నరేష్ కూడా కేవలం స్పూఫ్ లు కూడా ఉన్నా.. ఎక్కువగా డిఫరెంట్ గా యాక్ట్ చేయడం ఈ అల్లరి నరేష్ దెయ్యం సినిమాకు కలిసొచ్చేట్లుగా ఉంది.
సాధారణంగా హారర్ కామెడీలు తక్కువ బడ్జెట్ తో చుట్టేస్తుంటారు కానీ.. డీవీవీ దానయ్య నిర్మాణం కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి కూడా కొత్త సీన్స్ చూపించేద్దామనే ప్రయత్నం కాకుండా.. తెలిసిన వాటినే కొత్తగా చూపించి ఆఢియన్స్ ను ఎంటర్టెయిన్ చేయాలని భావించినట్లున్నాడు. ఇప్పటివరకూ ఇంట్లో దెయ్యం నాకేం భయంపై ఉన్న ఓ మోస్తరు అంచనాలను.. థియేట్రికల్ ట్రైలర్ విపరీతంగా పెంచేసింది.
Full View