కెరీర్ ఆరంభంలో మినిమం గ్యారెంటీ హీరో పేరును దక్కించుకున్న అల్లరి నరేష్ గత కొంత కాలంగా తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. అల్లరి నరేష్ కెరీర్ లో సక్సెస్ చివరిసారిగా వచ్చి చాలా కాలం అయ్యింది. అయినా కూడా తన వంతు ప్రయత్నం గా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. అయితే గతం తో పోల్చితే సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. దాంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించేందుకు కూడా సిద్దం అయ్యాడు. మహేష్ ‘మహర్షి’ చిత్రం లో అల్లరి నరేష్ కీలక పాత్ర లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇక మరో వైపు గిరి అనే దర్శకుడి దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక చిత్రంలో నటిస్తున్నాడు.
ఆ సినిమాకు ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. బాలకృష్ణ హీరోగా రమ్యకృష్ణ- రవీనా టాండన్ లు హీరోయిన్స్ గా నటించిన ఆ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు ఆ టైటిల్ ను అల్లరోడి కోసం వాడేందుకు దర్శకుడు టైటిల్ పై రైట్స్ ను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రం తో అల్లరి నరేష్ కు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నరేష్ గతంలో సూపర్ హిట్ చిత్రాల టైటిల్స్ అయిన యముడికి మొగుడు- అహానా పెళ్లంట- సుందరకాండ లను తన సినిమాల కోసం వాడుకుసి సక్సెస్ లను దక్కించుకున్నాడు. అందుకే ఈ సారి సెంటిమెంట్ ప్రకారం బంగారు బుల్లోడు టైటిల్ తప్పకుండా నరేష్ కు సక్సెస్ తెచ్చి పెడుతుందనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్ విషయంలో అధికారిక ప్రకటన రావడమే తరువాయి. మరో వైపు సత్తిబాబు దర్శకత్వంలో కూడా నరేష్ ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశాలున్నాయి.