యాభైకి పైగా సినిమాల్లో నటించిన కామెడీ హీరో అల్లరినరేశ్ ఇప్పుడు మేడ మీద అబ్బాయ్, అనే మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే, అయితే చాలా రోజులు తరువాత ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ మళ్లీ ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తుంది. ఈ సినిమా ప్రసార హక్కుల్ని ఓ ప్రముఖ ఛానల్ వారు రెండున్నర కోట్లుకి కొన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సినిమా ఎలా వర్క్ అవుట్ అవుతుందో అని టెన్షన్ లో మేడ మీద అబ్బాయ్ ప్రొడక్షన్ టీమ్ కాస్త కూల్ అయ్యారని తెలిసింది. శాటిలైట్ అయితే ఏదో మమ అనే రేట్ తో డీల్ అయిందిలే కానీ బిజినెస్ మాత్రం ఈ సినిమాకు నత్తనడక సాగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అల్లరోడుకి వరుస ఫ్లాపులు ఉండటమే దీనికి అసలు కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలానే నరేశ్ మార్కెట్ పెద్దగా లేకపోయినా, ఏదో గుడ్ విల్ కోసం సినిమా కొనేందుకు ముందుకు వస్తున్న బయ్యర్స్ కూడా టెన్షన్ పడుతూనే అడ్వాన్సులు ఇస్తున్నారట. దీంతో తన సినిమా కోసం అల్లరోడే స్వయంగా రంగంలోకి దిగి, సినిమాకి సంబంధించిన బిజినెస్ పై సైతం కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడని టాక్. అంతేకాదు శాటిలైట్ డీల్ లో కూడా అల్లరోడే ముగించాడని తెలిసింది. మరి ఇంత కష్టపడుతున్న అల్లరోడిని మేడ మీద అబ్బాయ్ గా ప్రేక్షకుల్ని ఏ రీతిన రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.