ఫోటో స్టోరి: మిస్సెస్ నరేష్‌ విత్ డాటర్

Update: 2018-02-02 16:50 GMT
కామెడీ చిత్రాల దర్శకుడు ఇవివి.సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ తండ్రికి తగ్గ తనయుడిగా తనదైన శైలిలో సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నరేష్ ఇన్నేళ్ల కెరీర్ లో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ అస్సలు తెచ్చుకోలేదు. ఇండస్ట్రీ పెద్దలతో అలాగే ప్రస్తుతం ఉన్న నటీనటులతో చాలా ఫ్రెండ్లిగా కొనసాగుతుంటాడు. అలాగే అల్లరోడు సినిమాలతో ఎలా అయితే మంచి పేరు తెచ్చుకున్నాడో ఒక భర్తగా తండ్రిగా కూడా మంచి నేమ్ తెచ్చుకున్నాడు.

నరేష్ సినిమా షూటింగ్స్ లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన చిన్న ఫ్యామిలీని ఏ మాత్రం మిస్ అవ్వడు. వారం గ్యాప్ వచ్చిందంటే చాలు తన గారాల కూతురు ఇవికాను చూడకుండా నరేష్ అస్సలు ఉండలేడు. అంతే కాకుండా నరేష్ - ఇవికా గోలకు నరేష్ భార్య విరూప ఒక్కోసారి గట్టిగా అరిచేస్తారట. ఈ సరదా విషయాలను అల్లరోడు కొన్ని సార్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక రీసెంట్ గా నరేష్ కూతురు ఇవికా భార్య విరుప కలిసి దిగిన ఫొటోలు చాలా స్పెషల్ గా ఉన్నాయి.

ట్రెడిషినల్ లుక్ లో ఇవివి ఇంటి ఇల్లాలు - వారసురాలు రెడీ అయ్యి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. తల్లి ఒళ్ళో ఇవికా స్మైల్ ఇస్తూ ఉండడం అందరిని ఆకర్షిస్తోంది. విరూప కొంచెం పెళ్లి కూతురి టెస్ట్ ని గుర్తుచేస్తున్నట్లు కూడా ఉంది. ఈ పోటోలను చూసిన చాలా మంది. నరేష్ కూతురు అప్పుడే ఇంత పెద్దదైందా అంటూ..సో నైస్ అనేస్తున్నారు. ఇక ప్రస్తుతం నరేష్ సుడిగాడు సీక్వెల్ కి సిద్దమవుతున్నాడు.   
Tags:    

Similar News