స‌ల్మాన్ సెట్లో ర‌ష్మికకు సెక్యూరిటీ దేనికి?

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ 2024 సినిమా `సికందర్` షూటింగ్‌ని అధికారికంగా పునఃప్రారంభించారు.

Update: 2024-10-23 17:30 GMT

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ 2024 సినిమా `సికందర్` షూటింగ్‌ని అధికారికంగా పునఃప్రారంభించారు. కొద్దిరోజుల‌ విరామం తర్వాత దిగ్గజ నటుడిని తిరిగి సెట్‌లో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సికిందర్ భారీ అంచ‌నాల న‌డుమ తెర‌కెక్కుతోంది. స‌ల్మాన్ కి ఇది గ్రేట్ కంబ్యాక్ ని ఇస్తుంద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. ఒక సోర్స్ వివ‌రాల‌ ప్రకారం..``అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. సల్మాన్ ఖాన్ సికందర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. ఈ ప్రకటన సకాలంలో నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాల‌నే నిబద్ధతను నొక్కి చెబుతుంది. నాణ్యమైన చిత్రాన్ని అందించాల‌నే ప‌ట్టుద‌ల‌ను, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.

దశాబ్దాలుగా బాలీవుడ్‌కు మూలస్తంభంగా నిలిచిన సల్మాన్‌కి ఇటీవ‌ల స‌రైన విజ‌యం ద‌క్క‌లేదు. దీంతో సికందర్ పై అత‌డు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో చాలా అంచ‌నాలున్నాయి. మురుగ‌దాస్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో ఇది ప్ర‌త్యేక‌మైన ప్ర‌య‌త్నంగా అంద‌రూ భావిస్తున్నారు. అయితే సికంద‌ర్ చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లి అనూహ్య‌ ప‌రిణామాల వ‌ల్ల అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది.

మొన్న‌టికి మొన్న గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచ‌రులు స‌ల్మాన్ ఖాన్ స్నేహితుడు, రాజ‌కీయ నాయ‌కుడు బాబా సిద్ధిఖ్ ని హ‌త‌మార్చ‌డంతో స‌న్నివేశం ఒక్క‌సారిగా మారిపోయింది. స‌ల్మాన్ ని నెక్ట్స్ టార్గెట్ చేస్తామ‌ని దుండ‌గులు వార్నింగ్ ఇచ్చారు గ‌నుక‌.. సెట్లో అధిక భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసారు. స‌ల్మాన్ చుట్టూ ఓ వైపు ప్ర‌భుత్వ భ‌ద్ర‌తా సిబ్బంది, మ‌రో వైపు ప్ర‌యివేట్ భ‌ద్ర‌తా సిబ్బంది మోహ‌రించారు. అత‌డు ప్ర‌స్తుతం సికంద‌ర్ సెట్లో ఉండ‌గా చుట్టూ ప‌హారా కోసం గార్డులు పోలీసులు ప‌రుగులు పెడుతున్నారు. అయితే ఈ ప‌రిస్థితి దృష్ట్యా స‌ల్మాన్ తో పాటు త‌న క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న కూడా కొంత ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోందిట‌. అయితే ఈ ప్ర‌త్యేక ప‌రిస్థితిని అర్థం చేసుకోకుండా ర‌ష్మిక మంద‌న్న కోసం భ‌ద్ర‌తా సిబ్బందిని అద‌నంగా పెంచార‌ని కొన్ని మీడియాలు ప్ర‌చురిస్తున్నాయి. కానీ ఈ సెక్యూరిటీ కేవ‌లం సల్మాన్ కోసం మాత్ర‌మేన‌ట‌. అత‌డి చుట్టూ ఉన్న‌వారి కోసం ర‌క్ష‌ణ అవ‌స‌రం ఉందా లేదా? అన్న‌ది పోలీసులు నిర్ణ‌యిస్తార‌ని ఒక స‌న్నిహిత వ్య‌క్తి పేర్కొన్నారు. స‌ల్మాన్ కి ర‌క్ష‌ణ పెంచ‌డం అంటే క‌చ్ఛితంగా అది సెట్లో ఉన్న అంద‌రికీ ర‌క్ష‌ణ అవ‌స‌రం అని భావించాల్సిన ప‌నిలేదని సంబంధిత వ్య‌క్తి పేర్కొన్నారు. సికంద‌ర్ చిత్రాన్ని 2025 లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News