నిర్మాతల్ని ఏకాకుల్ని చేయడం సబబా?

Update: 2015-05-23 22:30 GMT
టాలీవుడ్‌లో నిన్నటివరకూ ఆ నలుగురి గురించే చర్చ సాగేది. కానీ ఇప్పుడు ఆ 14 మంది వైపు చర్చ మళ్లింది. ఆ 14మంది తమకంటూ కొన్ని పరిమితులు విధించుకుని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ (టిఎఫ్‌పిసి)తో పనే లేకుండా సొంత గ్రూపు రెడీ చేసుకున్నారు. ఇక సొంత నిర్ణయాలతో సినిమాలు తీసుకుంటారు.. అంటూ ప్రచారం సాగుతోంది.

వాణిజ్య ప్రకటనల విషయంలో ఖర్చు తగ్గించుకుని.. పరిమిత బడ్జెట్‌ సినిమాలు చేయాలనుకోవడం వల్లే ఈ ప్రత్యేక గ్రూపు ఏర్పడింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఉన్న క్రైసిస్‌లో కేవలం రెండు చానెళ్లకు మాత్రమే ప్రకటనలు ఇవ్వడం ద్వారా కొంత ఖర్చు తగ్గించవచ్చు. ఒక విధంగా సినిమాకి అది మేలు చేస్తుంది. అందుకే ఈ కొత్త గ్రూపును ప్రారంభించారు. అయితే విడిగా గ్రూప్‌ పెట్టుకున్నవాళ్లకు తెలుగు నిర్మాతల మండలి సహకరించకూడదని నిర్ణయించుకుంది. ఒకవేళ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నుంచి సభ్యుల్ని లాక్కోవాలని ప్రయత్నిస్తే వెంటనే మండలిలో ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. అంతేనా టాలీవుడ్‌ దిగ్గజాలు నాగార్జున, బాలయ్య, చిరంజీవి వంటి వారి ప్రోత్సాహం కూడా ఈ గ్రూప్‌కి లేదు. వీళ్లంతా టిఎఫ్‌పిసి ద్వారానే తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. సో, స్టార్స్‌ సహకారం లేకుండా ఎలా?

అయితే ఇలా నిర్మాతలపై కక్ష సాధింపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా అని మరికొందరు విమర్శిస్తున్నారు. తెలుగు సినిమా కష్టాల కడలిలో ఉన్నప్పుడు బడ్జెట్‌లు, అనవసర ఖర్చులు తగ్గించుకుని సినమాలు తీస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. దీనికి టిఎఫ్‌పిసి పెద్దల స్పందన ఎలా ఉంటుందో?


Tags:    

Similar News