సినిమా నిర్మాణం అనేది ఓ ఆర్ట్. అందరికీ వంటబట్టేసేది కాదు. సినిమాలు వరుసగా తీసినా బ్యానర్ కి వేల్యూ తెచ్చిపెట్టడం.. దాన్ని కాపాడుకోవడం సులభమేమీ కాదు. అలాగని ఎంత గొప్ప నిర్మాతకైనా తీసిన సినిమాలన్నీ హిట్ కూడా అయిపోవు. ఇప్పుడు మిస్టర్ మూవీ నిర్మాతలకు.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ విషయంలోనే సుదీర్ఘమైన క్లాస్ తీసుకున్నారట.
మిస్టర్ మూవీ రిజల్ట్ చివరకు ఫ్లాప్ అని ట్రేడ్ జనాలు తేల్చేశారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే రాబట్టినా.. ఈ మూవీ ఫెయిల్ అవడానికి కారణం.. భారీగా ఖర్చు చేసేయడమే. వరుణ్ తేజ్ సినిమా రేంజ్ తో పోల్చితే.. ఇది నిజానికి కాస్ట్ ఫెయిల్యూర్. ఓవర్సీస్ లో వసూళ్లు సరిగా లేకపోయినా.. ఖర్చు తక్కువగా ఉంటే స్థానికంగా వచ్చిన కలెక్షన్స్ తోనే సేఫ్ జోన్ లోకి వచ్చేసేది. శ్రీను వైట్ల ఈ ప్రాజెక్టుపై ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడనే విషయం అర్ధమైనా.. నిర్మాతలు టాగూర్ మధు.. నల్లమలుపు బుజ్జి అంతగా అబ్జెక్ట్ చేయలేదు.
అదనంగా పెరిగిపోయిన క్యాస్టింగ్.. లొకేషన్స్.. వీటన్నిటితో తడిసి మోపెడయ్యి.. చివరకు మూవీ ఫ్లాప్ అయిందంటూ క్లాస్ తీసుకున్నారట అల్లు అరవింద్. బడ్జెట్ విషయంలో స్ట్రిక్ట్ గా లేకపోతే.. ఎంత గొప్ప ప్రాజెక్ట్ చేసినా చివరకు రిజల్ట్ తేడా కొడుతుందని చెప్పిన అల్లు.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూడాలని చెప్పారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/