టాప్‌ స్టోరి: ధృడంగా మెగానుబంధం

Update: 2018-08-23 04:53 GMT
మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ విడివిడిగా ఎవ‌రి కుంప‌టి వాళ్లు పెట్టుకున్నారంటూ ఓ వ‌ర్గం తెలుగు మీడియా సాగించిన‌ ప్ర‌చారానికి టోట‌ల్‌ మెగా ఫ్యామిలీ చెక్ పెడుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్‌! అంటూ భీష్మించ‌కుండా.. మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటే ప్ర‌తిదానికి ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని మెగా ఫ్యామిలీ నిరూపిస్తోంది. ఆ క్ర‌మంలోనే మెగా - అల్లు బంధం మ‌రింత ధృడ‌ప‌డింద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇటీవ‌లి కాలంలో ఏ ఈవెంట్ జ‌రిగినా మెగా హీరోలంతా ఏక‌మ‌వుతున్న తీరు - బాస్ అల్లు అర‌వింద్ వెన‌కుండి న‌డిపిస్తున్న తీరు చూస్తుంటే జ‌నంలోకి ఎన్నో పాజిటివ్ సంకేతాలే వెళ్లాయి. అస‌లు మేం విడిగా లేం.. క‌లిసే ఉన్నాం! అయినా మేం విడిపోయిందెప్పుడు?  విడ‌దీసి మీరే ప్ర‌చారం చేసుకున్నారు! అన్న తీరుగా లెంప‌కాయ కొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బాస్‌ లిద్ద‌రూ!

మెగాస్టార్ చిరంజీవి అనే వృక్షం లేక‌పోతే తామెవ‌రం లేమ‌న్న మాట‌ను వేదిక‌ల‌పైనే ప‌దే ప‌దే వ‌ల్లించే అల్లు కాంపౌండ్ ఆ గౌర‌వాన్ని నిల‌బెట్టుకుంటోంది. బాస్ అల్లు అర‌వింద్‌ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ - అల్లు శిరీష్ వీళ్లు ఎవ‌రు మాట్లాడినా మొద‌టి మాట మెగాస్టార్ గురించే మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత మెగా ఫ్యాన్స్ గురించి.. ఆ త‌ర్వాత త‌మ గురించి తాము మాట్లాడుతారు. ద‌టీజ్ ద స్పిరిట్‌. మెగాస్టార్ బ‌ర్త్‌డే వేళ చ‌ర‌ణ్‌- అల్లు అర్జున్ బాండింగ్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. ఆ ఇద్ద‌రూ వేరు కుంప‌టి అన్న ప్ర‌చారానికి ప్ర‌తిసారీ చెక్ పెట్టేందుకు ఆ ఇద్ద‌రూ ఒక‌రిగురించి ఒక‌రు పాజిటివ్‌ గా మాట్లాడుతూ .. కెరీర్‌ని స్పోర్టివ్ స్పిరిట్‌ తో ముందుకు న‌డిపిస్తున్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన పోటీతో ముందుకెళుతున్నామ‌న్న సంకేతాలు ఇస్తున్నారు.

అంతెందుకు మెగా బ‌ర్త్‌ డేని సెల‌బ్రేట్ చేసిందే అల్లు అర‌వింద్‌- అల్లు అర్జున్‌. ఆ ఈవెంట్ ఖ‌ర్చు స‌హా  మెగాఫ్యాన్స్ కో-ఆర్డినేష‌న్ ప్ర‌తిదీ ఆ ఇద్ద‌రే చూసుకున్నారు. ద‌టీజ్ కాల్డ్ బాండింగ్. మెగా- అల్లు బాండింగ్ ఇదే. ఇదే కాదు.. మెగాస్టార్ - ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మ‌ధ్య చిచ్చు పెట్టిన ఓ సెక్ష‌న్‌ మీడియాకి గుణ‌పాఠ‌మా? అన్న‌ట్టు.. మెగాస్టార్ చిరంజీవిని ప్ర‌తిసారీ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ క‌లుస్తూనే ఉన్నారు. అన్న‌య్య‌పై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నారు. అన్న‌య్య కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధ‌ప‌డ్డాకే జ‌న‌సేన పార్టీ పెట్టి పోరాటం సాగిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే .. చ‌ద‌రంగంలో పావులు క‌దిపేందుకు ఎదుటివాడికి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న మెగా వ్యూహం ఇందులో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News