అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ, మొదటి నుంచి కూడా తన తండ్రి వెంటే ఉంటూ నిర్మాణ పరమైన విషయాలను చూసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, నిర్మాతగా మారాడు. తన స్నేహితుడితో కలిసి ఆయన 'గని' సినిమాను నిర్మించాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.
"మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ వచ్చింది. కరోనా కారణంగా సెట్లు వేయడం .. తీయడం వలన పాపం వాళ్లు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఖర్చు అయింది. కానీ ఈ నిర్మాతలు ఏ రోజూ కూడా నీరసపడిపోకుండా చాలా యాక్టివ్ గా పనిచేశారు. అలా వాళ్లు ఈ సినిమాను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చి రిలీజ్ చేస్తున్నందుకు వాళ్లకి నేను కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమాకు బలంగా సపోర్ట్ చేసింది వరుణ్ .. అతని వల్లనే నిర్మాతలు అంత ధైర్యంగా ముందుకు వెళ్లారు.
ఇండస్ట్రీలో పైకి వచ్చినవాళ్లు .. తమ స్నేహితులను కూడా పైకి తీసుకుని రావడానికి ట్రై చేయడం నిజంగా మంచి పరిణామం. ఈ సినిమా విషయంలో వరుణ్ తేజ్ అదే చేశాడు . అందుకు నేను అతణ్ణి అభినందిస్తున్నాను. బన్నీ కూడా అంతే ప్రతి సినిమాకి ఎవరినో ఒకరిని తన కూడా పైకి తీసుకుని రావడానికి ట్రై చేస్తుంటాడు. వరుణ్ నిజంగానే మెగా ప్రిన్స్. తన ఆలోచన విధానంలో .. బిహేవియర్లో ఆ క్వాలిటీ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి వాళ్ల నాన్న లాగా మంచోడు. ' కేజీఎఫ్' చూసి బయటికి వచ్చిన తరువాత వరుణ్ తో ఇలాంటి సినిమా తీయాలి గదా అనిపించింది.
వరుణ్ అలాంటి పెద్ద సినిమాలు చేయాలి .. ఏదో ఒక రోజున చేస్తాడు. ఇక సైయీ మంజ్రేకర్ విషయానికి వస్తే తను చాలా స్వీట్ .. చాలా క్యూట్. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడమనేది నిర్మాతలకు సాహసమే అవుతుంది. అలాంటి సాహసమే బాబీ .. సిద్ధు చేశారు. నేను ఈ సినిమాను చూశాను గనుక చెబుతున్నాను .. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కిరణ్ కొర్రపాటి నిలబెట్టుకున్నాడు. త్వరలోనే అతను పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిపోతాడు. తనకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.