తెలుగు సినిమాల్లో ఎందరెందరో గొప్ప నిర్మాతలున్నారు. వాళ్లు అర్ధసెంచరీలు.. సెంచరీలు కూడా కొట్టారు. కానీ దిగ్గజాలుగా గుర్తింపు పొందిన ఆ నిర్మాతల్లో చాలామంది ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయారు. మారిన ట్రెండును అర్థం చేసుకోలేక.. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు చేయలేక వాళ్లందరూ వెనుకబడిపోయారు. కానీ ఇలాంటి తరుణంలో కూడా నిన్నటి తరం నిర్మాత అయిన అల్లు అరవింద్ మాత్రం ఇంకా తన ఉనికిని చాటుకుంటున్నాడు. దిల్ రాజు లాంటి ఈ తరం ఏస్ ప్రొడ్యూసర్లకు దీటుగా సినిమాలు నిర్మిస్తున్నాడు. విజయాలు అందుకుంటున్నాడు. ఇక్కడ తన విజయ రహస్యం ఏంటన్నది అల్లు అరవింద్ ఓ కార్యక్రమంలో చెప్పాడు.
యువి క్రియేషన్స్ వంశీ-ప్రమోద్.. బన్నీ వాసు.. జ్నానవేల్ రాజాలతో కలిసి అల్లు అరవింద్ ‘వి-4 క్రియేషన్స్’ పేరుతో ఓ కొత్త బేనర్ మొదలుపెట్టి దాని మీద ‘నెక్స్ట్ నువ్వే’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో చాలామంది పెద్ద నిర్మాతలు తాము చెప్పిందే వేదం అని.. తాము చెప్పిందే కరెక్ట్ అని.. మిగతా వాళ్లంతా వేస్ట్ అని అనుకోవడం వల్ల రిటైరైపోవాల్సి వచ్చింది. మారుతున్న కాలానికి తగ్గట్లుగా అభిరుచులు.. అభిప్రాయాలు మార్చుకోవడం అవసరం. అందుకే నేను నా చుట్టూ కొంతమంది యూత్ ను పెట్టుకుంటాను. బన్నీ వాసు లాంటి వాళ్లు నా చుట్టూ ఉన్నారంటే అది నా స్వార్థం కోసమే. వాళ్లతో ప్రతి రోజూ డిస్కషన్లు పెడతాను. రకరకాల విషయాలపై మాట్లాడుతుంటాను. యూట్యూబ్.. సోషల్ మీడియా.. ఇంకా అనేక విషయాలపై అవగాహన పెంచుకుంటాను. అప్పుడే మనకు ఈ తరం యువత అభిప్రాయాలు తెలుస్తాయి. కాబట్టే నేనింకా విజయవంతమైన సినిమాలు తీయగలుగుతున్నాను’’ అని అన్నారు. అరవింద్ చెప్పిన ఈ విషయాలు ప్రతి సీనియర్ నిర్మాతా ఆచరించాల్సిన విషయమే కదూ.