క్యూట్ అర్హ‌తో క‌లిసి గ‌ణేష నిమ‌జ్జ‌నం.. బ‌న్నీ వెరీ స్పెష‌ల్ అందుకే!

Update: 2022-09-05 14:24 GMT
రొటీన్ కి భిన్నంగా ఆలోచించ‌డం బ‌న్నీకి కొత్తేమీ కాదు. అలాగ‌ని సామిజిక క‌ట్టుబాట్ల‌కు దూరంగా వెళ్ల‌డు. సాంప్ర‌దాయాల్ని గౌర‌విస్తూ మూలాల్ని మ‌ర్చిపోకుండా కుటుంబ‌ గౌర‌వాన్ని పెంచ‌డం కోసం అత‌డు చేయ‌నిది లేదు! అత‌డు ప్ర‌తిసారీ ఎంతో ఉదాత్త‌మైన పూజ్య‌నీయ‌మైన ప‌నుల‌తో ఆక‌ట్టుకుంటారు.

ఊరు వాడా న‌గ‌రం అనే తేడా లేకుండా గ‌ణేష నిమ‌జ్జ‌నంతో సంద‌డి  వాతావ‌ర‌ణం నెల‌కొంది. చిన్నారులు పెద్ద‌లు మ‌హిళ‌లు అనే తేడా లేకుండా అంద‌రూ విఘ్న‌వినాయ‌కుని శ్ర‌ద్ధగా పూజించి సంస్కృతిని కాపాడేందుకు త‌మ‌వంతు ప్ర‌య‌త్నంలో ఉన్నారు. దానికి తానేమీ కొత్త కాద‌ని నిరూపించాడు బ‌న్ని.

సాంప్ర‌దాయాన్ని నిల‌బెట్టేందుకు తాను ఎల్ల‌పుడూ ముందుంటాన‌ని బ‌న్నీ ఇలా త‌న కిడ్స్ తో కలిసి బ‌య‌ల్దేరాడు. హైద‌రాబాద్ గీతా ఆర్ట్స్ ప‌రిస‌రాల్లో గ‌ణేష నిమ‌జ్జ‌నంలో తాను కూడా భాగం అయ్యాడు. అక్క‌డ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇలా త‌న పిల్ల‌ల‌ను ఈ గొప్ప ప్ర‌క్రియ‌లో భాగం చేశాడు.

ఇది సెల‌బ్రిటీ కిడ్స్ లో చాలా అరుదు. ఏదో ఇంట్లో హడావుడికి దూరంగా సైలెంట్ గా పూజ‌లు పున‌స్కారాల వ‌ర‌కూ ఓకే కానీ ఇలా ఆరుబ‌య‌ట సామాన్యుడిలా త‌న పిల్ల‌ల‌కు గ‌ణేష నిమ‌జ్జ‌నం సంబ‌రాన్ని చూపించాల‌నుకోవ‌డం వారిని కూడా ప్ర‌జ‌ల్లో స్వేచ్ఛ‌గా విహ‌రించేలా చేయ‌డం అన్న‌ది త‌నకు మాత్ర‌మే చెల్లింది. అల్లు అర్హ‌ కూడా ఈ సంబ‌రాల్ని త‌నివి తీరా ఆస్వాధించినందుకు ఎంతో ఆనందంగా క‌నిపించింది.

అర్హ కూడా గ‌ణేషుని వాహ‌నంలో బ‌య‌ల్దేరింది. గ‌ణ‌ప‌తి బ‌ప్ప మోరియా అంటూ అభిమానులు ప్ర‌జ‌ల‌తో క‌లిసి తాను కూడా ఆనందోత్సాహాల్లో తేలియాడింది. బ‌న్ని అక్క‌డ గుమిగూడిన అభిమానులకు అభివాదం చేస్తూ త‌న కార్ లో బ‌య‌ల్దేరారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View
Tags:    

Similar News