డీజే కాస్ట్యూమ్స్ అదిరిపోతున్నాయ్

Update: 2017-03-08 07:46 GMT
డీజే- దువ్వాడ జగన్నాధం మూవీ షూటింగ్ దశకు చేరుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకోసం.. ప్రస్తుతం అబుదాబిలో ఓ పాటను పిక్చరైజ్ చేస్తున్నారు. 'అస్మైక భోగ.. తస్మైక యోగ.. రస్మైక రాగ హిందోళం' అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ భలే ఆకట్టుకుంటున్నాయి.

ఇటు హీరో అల్లు అర్జున్ కి.. అటు హీరోయిన్ పూజా హెగ్డేకి.. పూర్తిగా బ్లాక్ థీమ్ తో డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సూపర్ గా ఉన్నాయి. అబుదాబి అందాల మధ్య తీస్తున్నా.. ఇది థీమ్ బేస్డ్ సాంగ్ కావడంతో.. సంప్రదాయాన్ని.. అధునికతను మేళవించి ఈ డ్రస్సులను డిజైన్ చేశారు. స్లీవ్ లెస్ జాకెట్ వేసిన.. పూజా హెగ్డే చీరకట్టు అద్భుతంగా ఉందని చెప్పాల్సిందే. మరోవైపు టీషర్ట్.. లూజ్ ప్యాంట్ వేసిన బన్నీ గెటప్.. డిఫరెంట్ గా ఉంది. దానిపై అద్దాలను మల్టీ కలర్ దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన విధానం అదిరిందని చెప్పాలి.

డీజే పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ మూవీ టీజర్ కు వచ్చిన స్పందన చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికే 8 మిలియన్ల వ్యూస్ దాటిపోయాయి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక బ్రాహ్మణుడి పాత్రలో బన్నీ చేయనున్న కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం.. సమ్మర్ వరకూ ఆగాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News