ఒంట‌రి దీవుల్లో `బ‌న్ని-స్నేహ` ఆకాశ‌మే హ‌ద్దుగా

Update: 2021-04-05 13:40 GMT
కొన్ని నెలలుగా ఉత్త‌రాది- ద‌క్షిణాది స్టార్స్ మాల్దీవుల విహారానికి ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒంట‌రి దీవుల్లో అన్ని ఒత్తిళ్ల‌ను మ‌ర్చిపోయేందుకు క‌పుల్ గోల్స్ ని ఫిక్స్ చేసుకునేందుకు ఈ దీవుల‌కు వెళ్లారు. ఇప్ప‌టికీ ఈ ఫ్లో అలానే కంటిన్యూ అవుతోంది.

సౌత్ నుంచి ఇటీవ‌ల‌ యష్- పృథ్వీరాజ్ సుకుమారన్ - విష్ణు విశాల్ త‌దిత‌రులు కుటుంబ స‌మేతంగా మాల్దీవుల విహారానికి వెళ్లారు. అక్క‌డ బ్లూ సీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. విహార‌ యాత్ర‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు అల్లు అర్జున్ త‌న భార్య పిల్ల‌ల‌తో క‌లిసి మాల్దీవుల సెలవులను ఆస్వాధిస్తూ తన కుటుంబ సెల‌బ్రేష‌న్స్ ఫోటోలను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు.

అక్కడ అయాన్ పుట్టినరోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకున్న ఈ జంట తాజాగా మ‌రో చిల్లింగ్ ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో బ‌న్ని పూర్తిగా గుబురు గ‌డ్డంతో క‌నిపిస్తున్నారు. అత‌డు వాట‌ర్ ప్రూఫ్ గ్లాస్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. బ్లాక్ టీష‌ర్ట్ కాంబినేష‌న్ బ్లాక్ హ్యాట్ తో హాలీవుడ్ కౌబోయ్ లా క‌నిపిస్తున్నారు. త‌న‌తో పాటే స్నేహ ఓ స్పెష‌ల్ హ్యాట్ ని ధ‌రించి స్మైలిస్తూ క‌నిపించారు. ఈ ఫోటో ఈ విహారానికే హైలైట్ అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇంత‌కుముందు బ‌న్ని-స్నేహ జంట కుటుంబ స‌మేతంగా దుబాయ్ విహారానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. దుబాయ్ విహారం అనంత‌రం కేజీఎఫ్‌ ప్రశాంత్ నీల్ తో సినిమా గురించి బ‌న్ని సమావేశమయ్యారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సుకుమార్ దర్శకత్వం లో పుష్ప చిత్రీక‌ర‌ణ సాగుతోంది. బ‌న్ని దుబాయ్ విహారయాత్రకు వెళ్లేముందే రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. మారేడుమిల్లి గోదారి ప‌రిస‌ర అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. బ‌న్ని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా మంచి స్పందన వచ్చింది. పుష్పకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజున పుష్ప‌ టీజర్ విడుద‌ల కానుందని ప్ర‌చార‌మ‌వుతోంది.
Tags:    

Similar News