మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న అల వైకుంఠపురములో విడుదలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉన్నప్పటికీ టీమ్ ఇప్పటినుంచే ప్రమోషన్ విషయంలో చాలా ప్లానింగ్ తో ఉంది. సాధారణంగా మేకింగ్ కు చాలా ఎక్కువ టైం తీసుకునే త్రివిక్రమ్ వచ్చే నెలాఖరుకాంతా కొంత భాగం మినహాయించి మిగిలినదంతా పూర్తిచేసి కొత్త సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేయబోతున్నట్టు సమాచారం. స్టార్ట్ అవ్వడమే లేట్ గా మొదలుపెట్టుకున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్నా మేకింగ్ మాత్రం యమా ఫాస్ట్ గా ఉందట.
నిజంగా త్వరగా అయిపోతోందా లేక చుట్టేస్తున్నారా అనే అనుమానం లేకపోలేదు. గతంలో అజ్ఞాతవాసి విషయంలోనూ ఇలాంటి తొందరపాటే కొంపముంచింది. కానీ అల వైకుంఠపురములోకి అలా జరగకుండా పక్కా ప్లానింగ్ జరిగిందట. బన్నీ మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ తో పాటు సుకుమార్ ప్రాజెక్ట్స్ కి డేట్స్ పరంగా క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. లైన్స్ ఓకే అయ్యాయి కానీ ఫైనల్ లాక్ జరగలేదు. నవంబర్ నుంచి ఎలాగూ కాస్త వెసులుబాటు వస్తుంది కాబట్టి ఈలోగా ఓ నిర్ణయం తీసుకోవచ్చు.
మరోవైపు అరవింద సమేత వీర రాఘవకు ఏడాది గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేయొచ్చనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలా వైకుంఠపురములో ఎలాగూ ఫాస్ట్ గా అవుతుంది కాబట్టి తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ త్వరగానే ఇవ్వొచ్చు. ఫాస్ట్ గా తీసినా స్లోగా తీసినా కంటెంట్ లో క్వాలిటి ముఖ్యం కాబట్టి దానికి న్యాయం చేకూర్చిన నాడు బన్నీ ఖర్చు పెట్టిన ఏడాదిన్నర గ్యాప్ కి సార్ధకత దక్కుతుంది. చూద్దాం.