దర్శకుడిగా మొదట్నుంచి చిన్న సినిమాలే చేస్తూ వస్తున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన సినిమా చేసిన కొంచెం పెద్ద స్థాయి హీరో అంటే నాని మాత్రమే. అతడితో తీసిన ‘జెంటిల్ మన్’ మంచి విజయాన్నందుకుంది. దీని తర్వాత ఆయనకు కొంచెం పెద్ద రేంజున్న హీరోల నుంచి అవకాశాలు వస్తాయని భావించారు. అక్కినేని నాగచైతన్యతో ఒక సినిమా దాదాపుగా ఓకే అయింది కూడా. కానీ అనివార్య కారణాలతో అది ఆగిపోయింది. ఆ తర్వాత ‘అమీతుమీ’.. ‘సమ్మోహనం’ లాంటి చిన్న సినిమాలే చేశాడు ఇంద్రగంటి. ఆయన తర్వాతి సినిమా ఏంటన్నది ఇంకా ఖరారవ్వలేదు. ఐతే తనకు పెద్ద హీరోలతో చేయాలన్న కోరిక లేకుండా ఏమీ లేదంటున్నాడు ఇంద్రగంటి. ‘జెంటిల్‌మన్’ కంటే ముందే తాను చాలామంది ప్రముఖ కథానాయకుల్ని కలిశానని.. అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడని ఇంద్రగంటి వెల్లడించాడు.
ఐతే పెద్ద హీరోలతో సినిమా ఓకే కావడానికి చాలా అంశాలు కలిసి రావాల్సి ఉంటుందని ఇంద్రగంటి చెప్పాడు. మనం ఓ కథతో వెళ్లినపుడు అవతల హీరోలు ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నారన్నది కూడా కీలకమే అన్నాడు. అల్లు అర్జున్ తనతో చాలా బాగా మాట్లాడాడని.. ‘మనం తప్పకుండా సినిమా చేద్దాం మోహన్’ అని చెప్పాడని ఇంద్రగంటి వెల్లడించాడు. బన్నీతో పాటు చాలామంది కథానాయకుల్ని కలిశానని.. అందులో నాని ఒకడని.. అతను వెంటనే ఓకే అనడంతో సినిమా చేసేశానని.. భవిష్యత్తులో కచ్చితంగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తానని అన్నాడు. పెద్ద హీరోలతో సినిమా చేయడం వల్ల కథలు చాలామందికి చేరువవుతాయన్నాడు. కాకపోతే హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తాను కథలు రాయలేనని.. కథ తయారు చేశాక దానికి తగ్గ హీరోను ఎంచుకుని మాత్రమే సినిమా చేయగలనని ఇంద్రగంటి స్పష్టం చేశాడు.