అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య-ఆర్య 2 మ్యూజిక్ పరంగా ఎంతటి సంచలనాలో తెలిసినదే. చార్ట్ బస్టర్ పాటలతో దేవీశ్రీ ప్రసాద్ రాకింగ్ అనిపించారు. ఇక ఆర్య2లో రింగ రింగ ఐటెమ్ నంబర్ ఏ రేంజులో వర్కవుటైందో తెలిసినదే. రింగ్ టోన్లలో రఫ్ఫాడించేసింది ఈ స్పెషల్ ఐటమ్ లిరిక్.
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆ రేంజులో దేవీ శ్రీ నుంచి ఐటెమ్ నంబర్ రెడీ అవుతోందని ఇటీవల వార్తలు గుప్పుమంటున్నాయి. మరోసారి బన్ని-సుక్కూ కోసం దేవీ బరిలో దిగిన సంగతి తెలిసినదే. పుష్ప చిత్రీకరణ ఓ వైపు పూర్తవుతుంటే.. ఇప్పటికే అన్ని బాణీల్ని రెడీ చేసేశానని తాజాగా దేవీశ్రీ వెల్లడించారు. ముఖ్యంగా బన్ని-సుక్కూ కోసం స్పెషల్ ఐటెమ్ నంబర్ రెడీ అయ్యిందని చెప్పడం ఆసక్తిని పెంచింది.
సుకుమార్ ఇతర సినిమాల్లానే పుష్పలో కూడా ఒక ప్రత్యేక పాట ఉంటుందని దేవీశ్రీ ధృవీకరించారు. ఇప్పటికే బాణీల్ని సిద్ధం చేశానని మొత్తం ఆల్బమ్ భిన్నంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. ``ఒక వైపు బన్నీ డార్లింగ్ తో.. మరోవైపు సుక్కుభాయ్ తో చర్చించా.. మీరు త్వరలో మంచి సంగీతం వింటారు`` అని దేవి అన్నారు. ``సుక్కు సినిమాకు మీరు బెస్ట్ మ్యూజిక్ ఇస్తావని నాకు తెలుసు. కానీ పుష్ప అంచనాలకు మించి పోయింది`` అని చెప్పడానికి బన్నీ తనకు పుష్ప సెట్స్ నుండి ఫోన్ చేశారని తెలిపారు. సెట్స్ లో పుష్ప రాగాలు విన్న తర్వాత నిర్మాత దిల్ రాజు కూడా ఉల్లాసంగా ఉన్నారట.
దేవి శ్రీ ప్రసాద్ తనకు ప్రేమకథలపై ప్రత్యేక ఆసక్తి ఉందని... జల జల జలపాతం అనే పాట కోసం `ఉప్పెన` సినిమా చేయాలనుకున్నానని.. పాటలు అన్నీ బాగా కుదిరాయని దేవీశ్రీ అన్నారు. ఖిలాడి- నితిన్ - రంగ్ దే- గుడ్ లక్ సఖి- ఎఫ్ 3 చిత్రాలకు దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. పవన్-హరీష్ చిత్రానికి దేవీనే సంగీతం అందించనున్నారు.