ఎవరో తిట్టడం ఎందుకనేనా బన్నీ ..

Update: 2018-12-18 14:16 GMT
తెలుగులో ఉన్నంతమంది వారసత్వ హీరోలు మరే ఇండస్ట్రీలోనూ ఉండరేమో. మన పరిశ్రమలో వారసత్వం అన్నది దశాబ్దాలుగా ఉంది కానీ.. గత దశాబ్ద కాలం లో మరీ ఎక్కువైపోయింది. ఇబ్బడిముబ్బడి గా వారసులు వచ్చేశారు. హిట్లు ఫ్లాపుల తో సంబంధం లేకుండా అందరూ కంటిన్యూ అయిపోతున్నారు. ముఖ్యం గా మెగా ఫ్యామిలీ లో వారసుల సంఖ్య రెండంకెలకు చేరిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీని పై తరచుగా విమర్శలు వ్యక్తమవుతుంటాయి. సామాజిక మాధ్యమాల్లో అయితే వారసుల మీద బోలెడన్ని కామెంట్లు పడుతుంటాయి. అందులోనూ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ సాధించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్న నాని.. శర్వానంద్.. విజయ్ దేవరకొండ లాంటి వాళ్లను చూసినపుడు వారసుల విలువ తగ్గిపోతుంటుంది.

వీళ్లను వాళ్ల తో పోల్చి గాలి తీస్తుంటారు సోషల్ మీడియా జనాలు. ఈ నేపథ్యంలోనే ‘పడి పడి లేచె మనసు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శర్వానంద్ సెల్ఫ్ మేడ్ హీరో అని.. అలాంటి వాళ్లను చూస్తే తన కు చాలా గౌరవం అని చెబుతూ.. అతను తన గురించి తాను షాకింగ్ కామెంట్స్ చేసుకున్నాడు. ‘‘మేమందరం ఎంతో కొంత బలిసిన క్యాండేట్లం. కొంచెం బ్యాగ్రౌండ్ ఉంది. హైలీ నెపోటిజం కి బ్రాండ్ అంబాసిడర్స్ మేం’’ అని వ్యాఖ్యానించి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు బన్నీ. మామూలుగా మన మీద ఎవరికైనా కోపం ఉంటే.. వాళ్లు అనాల్సిన మాటల్ని మనకు మనమే అనేసుకుంటే అవతలి వాళ్ల మనసు తేలిక పడిపోతుంది. నెగెటివిటీ తగ్గుతుంది. ఆ దిశగానే బన్నీ ఆలోచించినట్లున్నాడు. ఆ మధ్య విజయ్ దేవరకొండను.. ఇప్పుడు శర్వా ను తెగ పొగిడేయడం ద్వారా తనలో ఉన్న ఒక గిల్టీనెస్‌ ను కూడా అతను బయటపెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News