సౌత్ సినిమాలకు నార్త్ లోనూ క్రమంగా గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే దక్షిణాదికి చెందిన పలు సినిమాలను బాలీవుడ్ హీరోలు రీమేక్ చేస్తుండగా.. ఇక్కడి నుంచి డబ్ అయిన సినిమాలకు కూడా ఆడియన్స్ పెరిగిపోతున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కిన ప్రతీ సినిమా.. ఇతర భాషల్లోనూ డబ్ అవుతోంది. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం(డీజే ) మూవీకూడా డబ్ అయ్యింది. అయితే.. ఈ మూవీ అక్కడ బుల్లితెరపై రికార్డులు నమోదు చేయడం విశేషం.
2017లో విడుదలైన ఈ సినిమా.. మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నార్త్ లో సత్తా చూపుతోంది. ఇటీవల భోజ్ పురి వెర్షన్ టీవీలో ప్రసారమై రికార్డు క్రియేట్ చేసింది. 39.83 లక్షల ఇంప్రెషన్స్ తో సత్తా చాటింది. ఈ ఫీట్ తో బుల్లితెరపై అత్యధికంగా వీక్షించిన భోజ్ పురి చిత్రంగా నిలిచింది డీజే డబ్బింగ్ మూవీ.
అయితే.. టీవీలోనే కాదు, యూట్యూబ్ లో కూడా సత్తా చాటింది. 326 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోందీ సినిమా. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో బన్నీ ఫాలోయింగ్ నార్త్ లో కూడా పెరిగిపోతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అప్ కమింగ్ మూవీ ‘పుష్ఫ’కు నార్త్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.