అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే-దువ్వాడ జగన్నాధంకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. వీకెండ్స్ తో పాటు సోమవారం నాడు రంజాన్ పండుగ కావడం.. బన్నీ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండడంతో.. వసూళ్లు ఇరగదీసేశాడు.
కానీ మంగళవారం నుంచి అసలైన టెస్ట్ డీజేకు మొదలైంది. ఏపీ.. తెలంగాణల్లో తొలి రోజున 17.92 కోట్లు వసూలు చేసిన డీజే.. రెండో రోజున 8.19 కోట్లు.. మూడో రోజున 8.61 కోట్లు.. సోమవారం 7.72 కోట్లు కొల్లగొట్టాడు. మంగళవారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు కలిపి 4.27 కోట్లుగా నమోదయ్యయి. మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ తో పోల్చితే వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అయితే.. వీక్ డేస్ లో 4.27 కోట్లంటే పెద్ద విషయంగానే చెప్పాలి. కానీ ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది. కాని చేయగలదా అనేదే అసలు ప్రశ్న ఇక్కడ. ఏపీ-తెలంగాణల్లో దువ్వాడను 60 కోట్లకు విక్రయించారు. మిగిలిన ఏరియాస్ తో కలుపుకుని వరల్డ్ వైడ్ గా 80 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ చేసింది. ఈ మొత్తం అందుకోలేకపోతే మాత్రం.. ఎంత వసూలు చేసినా చివరకు ఉపయోగం ఉండదు.
అయితే.. రెండో వారంతం కూడా పెర్ఫామ్ చేసే అవకాశం ఉండడం.. పెద్దగా పోటీ లేకపోవడం.. జనాలకు వేరే ఆప్షన్ కూడా లేకపోవడాన్ని డీజేకి పాజిటివ్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే డీజే బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు అవకాశాలు కొంతమేర ఉన్నాయంటున్నారు ట్రేడ్ జనాలు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ అంతా కలుపుకుంటే డిజె సినిమా ఇప్పటివరకు 58 కోట్లు షుమారు షేర్ వసూలు చేసింది. మరో 22 వస్తుందా? తెస్తుందా? వెయిట్ అండ్ సి
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/