ఒక వారంలో 50 కోట్లు.. నాలుగోసారి

Update: 2017-06-30 11:03 GMT
ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'డిజె దువ్వాడజగన్నాథమ్' సినిమా మరో ఫీట్ చేసింది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా వస్తున్న కలక్షన్లు.. ఈ సినిమాతో మరో విన్యాసం చేయించాయి. సరిగ్గా నిన్నటికి ఈ సినిమా రిలీజై వారం రోజులు కావొస్తోంది. ఈ సందర్భంగా కలక్షన్ లెక్కలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం పదండి.

కేవలం 7 రోజులు పూర్తయ్యేసరికి.. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 50+ కోట్లు షేర్ పట్టేశాడు దువ్వాడ జగన్నాథమ్. ప్రపంచవ్యాప్తంగా కలుపుకుని 60+ కోట్లు షేర్ వస్తే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ తో ఇప్పుడు కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. ఇప్పటివరకు తొలివారంలో 50 కోట్లు పైగా 'షేర్' వసూలు చేసిన సినిమాలు మూడే ఉన్నాయి. బాహుబలి, బాహుబలి 2 అండ్ ఖైదీ నెం 150 ఆ సినిమాలు. తొలి వారంలో బాహుబలి 2 సినిమాకు 117+ కోట్లు వస్తే.. బాహుబలి సినిమాకు 61+ కోట్లు.. ఖైదీ నెం 150 కు 56+ కోట్లు.. ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ కు నాలుగో స్థానంలో 50+ కోట్లు వచ్చాయి. మొత్తానికి నాలుగోసారి ఇండస్ర్టీలో ఆ ఫీట్ జరిగింది అంటూ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇకపోతే వచ్చే శుక్రవారం వరకు వసూళ్ళకు డిజె దువ్వాడ జగన్నాథమ్ కు పెద్ద ఛాన్సే ఉంది. కాకపోతే పెరిగిన టిక్కెట్ రేట్.. నిధానంగా తగ్గిపోతున్న ఆక్యుపెన్సీ కారణంతో.. ఇప్పుడు డిజె ఎంతవరకు బండి లాగుతాడు అనేదే ప్రశ్నార్ధకం. మొత్తంగా 80 కోట్లు షేర్ వస్తేనే డిస్ర్టిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉంటారు అనేది ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా చూస్తే మనకు తెలుస్తున్న విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News