తమిళ దర్శకుడు శంకర్ స్టామినా ప్రపంచానికి మొదట తెలిసింది జెంటిల్ మేన్ సినిమాతోనే. తొంభైల్లో వచ్చిన ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్టయింది. బ్రాహ్మణ యువకుడిగా.. దోపిడీ దొంగగా రెండు యాంగిల్స్ లో కనిపించే పాత్రలో అర్జున్ ఎంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత శంకర్ వరస హిట్లు వచ్చి అగ్ర దర్శకుడయ్యాడు. ఈ సినిమా గురించి ఇప్పటి కుర్రాళ్లకు తెలిసింది తక్కువే అయినా పాతికేళ్ల క్రితం ఈ సినిమాను చూసినవారెవ్వరూ ఇప్పటికే మర్చిపోలేరు.
ఈ సినిమాను ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందీ అంటే తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ స్టోరీ లైన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందనేది టాక్. జెంటిల్ మేన్ లో ఒకవైపు బ్రాహ్మణ అగ్రహారంలో వంటలు చేసుకుంటూనే మరోవైపు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. డీజే లో కూడా ఫస్ట్ హాఫ్ లో సంప్రదాయకమైన బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తూ. క్యాటరింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అండ్ ఎంటర్ టెయినింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో జెంటిల్ మెన్ లో అర్జున్ లాగా డిఫరెంట్ గా కనిపించనున్నాడు. ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ సీన్లకు ప్రాధాన్యం ఉంటుంది. పూజాహెగ్డే రొమాంటిక్ ట్రాక్ అదిరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి-2 తర్వాత భారీ సినిమాలు ఏమీ రిలీజ్ కాకపోవడం.. అప్పటికి ఏవీ కాంపిటీషన్ లో లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఏదేమైనా అల్లు అర్జున్ ఆనాటి అర్జున్ ను గుర్తు చేయడానికి సిద్ధమైపోతున్నాడట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/