డీజే.. 4 కోట్లకు ముంచిందా?

Update: 2017-07-03 08:24 GMT
‘దువ్వాడ జగన్నాథం’కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమాకు అంచనాల్ని మించి వసూళ్లు వచ్చాయి. వీకెండ్ తర్వాత రంజాన్ హాలిడే కూడా కలిసొచ్చింది. ఆ తర్వాత కూడా వసూళ్లు స్టడీగానే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాపై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది కానీ.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటరే అన్యాయం అయిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడ ‘డీజే’ వసూళ్లు ఆశాజనకంగా లేవు. ప్రిమియర్లకు రెస్పాన్స్ బాగానే కనిపించింది. తొలి రోజూ ఓకే. కానీ తర్వాతే పరిస్థితి తల్లకిందులైంది. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోవడంతో అక్కడ ఆశించిన వసూళ్లు రాలేదు.

ప్రిమియర్లతో కలిపి తొలి రోజుకే హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసిన డీజే.. ఇంకో హాఫ్ మిలియన్ కోసం ఆరు రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం అమెరికా 1.1 మిలియన్ డాలర్లే వసూలు చేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 1.2-1.3 మిలియన్ డాలర్లకు పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఉన్న హైప్ చూసుకుని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.9 కోట్ల పెట్టుబడి పెట్టేశాడు. ఇప్పుడు చూస్తే షేర్ రూ.5 కోట్లకు మించేలా లేదు. రూ.4 కోట్ల దాకా నష్టం తప్పేలా లేదు. అమెరికాలో వచ్చే వసూళ్లలో సగానికి సగం ఖర్చులు.. పన్నుల రూపంలో పోతాయి. షేర్ యాభై శాతమే వస్తుంది. ఫుల్ రన్లో గ్రాస్ రూ.10 కోట్లలోపే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. క్లాస్ గా.. డిఫరెంట్ గా ఉండే సినిమాల్ని ఇష్టపడే ఓవర్సీస్ ఆడియన్స్ కు రొటీన్ మసాలా అయిన ‘డీజే’ రుచించలేదు. ఇలాంటి సినిమాలు వస్తే హీరో ఎవరన్నది కూడా పట్టించుకోరు అక్కడి జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News