మ‌బ్బుల‌ను చూస్తూ... కొడుకుతో ఎంజాయ్ చేస్తూ

Update: 2018-05-04 08:17 GMT
ఈరోజు బ‌న్నీ ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల‌వుతోంది. దీంతో సినిమా విడుద‌ల‌కు ముందు  అంద‌రి హీరోల్లాగే బ‌న్నీకి కూసింత టెన్ష‌న్ ఉంటుంది. అందులోనూ హిట్లు వ‌స్తూన్నా... ‘రంగ‌స్థ‌లం’ సినిమాతో చెర్రీ ముందుకు దూసుకుపోవ‌డంతో త‌న‌ స్టార్ హీరో రేంజ్ ను నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి. ఈ టెన్ష‌న్ నుంచి రిలీఫ్ పొంద‌డానికి కొడుకు అయాన్ తో క‌లిసి ఇలా ఆకాశాన్ని చూస్తూ గ‌డుపుతున్నాడు బ‌న్నీ.

నిన్న వాతావ‌ర‌ణం చల్ల‌బ‌డింది. మండు ఎండ‌లకు కాసింత బ్రేక్ వేస్తూ చల్ల‌ని చినుకులు న‌గ‌రాన్ని ప‌ల‌క‌రించారు. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే ఆకాశంలో క‌మ్ముకున్న మ‌బ్బుల‌ను కొడుకుని చూపిస్తూ... గోడెక్కి నిల్చున్నాడు బ‌న్నీ. ఆ దృశ్యాన్నీ బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహారెడ్డి కెమెరాలో బంధించింది. ప్రొఫెష‌న‌ల్ ఫోటోగ్రాఫ‌ర్ తీసిన రేంజ్‌లో ప‌క్కాగా ఫోటో క్యాప్చ‌ర్ చేసింది స్నేహ‌. వాతావర‌ణం కూడా ఆమెకి క‌లిసొచ్చింది. ఈ ఫోటోని సోష‌ల్ మీడియాలో పెట్ట‌గానే తెగ వైర‌ల్ అయిపోయింది. ‘నా పేరు సూర్య‌’ కోసం బ‌న్నీ శారీర‌కంగా చాలా మారిపోయాడు. ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్టం మొత్తం ఈరోజు తెర మీద క‌నిపిస్తోంది.

మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తెలుగు-త‌మిళ‌- మ‌ల‌యాళ భాషల్లో ఈరోజు విడుద‌ల కానుంది. త్వ‌ర‌లో హిందీలోనూ డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది చిత్ర బృందం. ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన వ‌క్కంతం వంశీ ఈ సినిమాకు తొలిసారి డైరెక్ష‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.



Tags:    

Similar News