బన్నీ టాప్ లీగ్ లోకి వచ్చేశాడు

Update: 2017-06-26 08:16 GMT
ఇప్పుడు 'డిజె దువ్వాడ జగన్నాథమ్' సినిమా సోమవారం కూడా తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ హాలిడే ఉండటంతో.. పొద్దున్న మార్నింగ్ షో కూడా బాగానే హౌస్ ఫుల్స్ తో ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు తొలిరోజు తొలి ఆటకే మిక్స్ డ్   టాక్ వచ్చేసింది. ముఖ్యంగా క్రిటిక్స్ కు అసలు సినిమాయే నచ్చలేదు. కాని బన్నీ మాత్రం చాలా ఆనందంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అందుకు ఒక రీజన్ ఉందట.

మొన్నటివరకు తెలుగులో కన్సిస్టెంట్ గా రాణిస్తూ భారీ కలక్షన్లు వసూలు చేస్తున్న లిస్టులో మహేష్‌ బాబు అండ్ రామ్ చరణ్‌ పేర్లు వినిపిస్తే.. ఆ తరువాత ఇప్పుడు ఆ లిస్టును వేరే హీరోలు డామినేట్ చేస్తున్నారు. బాహుబలి తరువాత మెగాస్టార్ చిరు అండ్ జూ.ఎన్టీఆర్ లు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక హిట్టు కొట్టకపోయినా కూడా పవన్ కళ్యాణ్‌ ఇదే రేంజులో ఉన్నాడులే. అయితే ఈ లీగ్ కు బాగా దూరంగా ఉన్న బన్నీ.. ఇప్పుడు మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. అందుకే మనోడు ఆనందపడుతున్నాడట.

డిజె సినిమా తొలిరోజున ఏకంగా 33 కోట్ల గ్రాస్.. అంటే షుమారుగా 18 కోట్ల షేర్ వసూలు చేసింది. అసలు తెలుగులో ఇప్పుడున్న బడా ఫిగర్లను తీసుకుంటే.. బాహుబలిని పక్కనెట్టేసి.. మెగాస్టార్ ఖైదీ నెం 150 తొలిరోజున 23+ కోట్లు వసూలు చేయగా.. కాటమరాయుడు 22+ కోట్లు.. జనతా గ్యారేజ్ 20+ కోట్లు వసూలు చేశాయి. వీటికి దగ్గరగా ఇప్పుడు బన్నీ కూడా 18+ కోట్లు షేర్ వసూలు చేయడంతో.. పెద్ద లీగ్ లోకి వచ్చేశాడనే చెప్పాలి. ఇక మొన్నటివరకు టాప్ ఫాంలో అలరించి మహేష్‌ అండ్ చరణ్‌ మాత్రం.. శ్రీమంతుడు (14.5+ కోట్లు).. బ్రూస్ లీ (12.5+ కోట్లు) లతో బన్నీకంటే వెనుకే ఉన్నారు. ఈ ఫిగర్స్ అన్నీ చూసుకుని.. ఇప్పుడు బన్నీ హ్యాపీ అయిపోతున్నాడట. ఎందుకంటే స్టార్ హీరోలకు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ ఉంటేనే.. వారిని సూపర్ స్టార్ అంటారు.

అయితే ఈ టాప్ లీగ్ లోకి రావడానికి ఇప్పటివరకు చాలా కష్టాలు పడ్డానని.. డ్యాన్సుల నుండి డిక్షన్ వరకు ఎంతో కష్టపడి చేస్తేనే ఈ స్థాయి సక్సెస్ ను ప్రేక్షకులు అందించారని.. అందుకే మిక్సడ్ టాక్ వచ్చినా కూడా కలక్షన్లు అరిపిస్తున్నాయి.. బన్నీ నమ్ముతూ.. ఇప్పుడు థ్యాంక్యూ మీట్ కూడా పెడుతున్నాడట. ఈ నెంబర్ల గురించి ఇంకేమన్నా చెబుతాడేమో అప్పుడు చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News