బన్నీ ఫాలోయింగ్ ఇంతనా? జనప్రవాహంగా మారిన అమీర్ పేట

Update: 2023-06-15 13:00 GMT
టాప్ హీరోలు.. హీరోయిన్లు సినిమాలు మాత్రమే చేసే రోజులు పోయి చాలాకాలమే అవుతోంది. ఎవరికి వారు తమ సినిమాలతో పాటు.. తమకు నచ్చిన రంగానికి చెందిన వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చి దూసుకెళుతున్నారు.

హైదరాబాద్ లోని అమీర్ పేట అన్నంతనే సత్యం థియేటర్ గుర్తుకు రాకుండా మానదు. హైదరాబాదీయులకు సుపరిచితమైన సత్యం థియేటర్ ను పడగొట్టేసి.. దానిస్థానంలో అత్యాధునిక భారీ మల్టీఫ్లెక్స్ ను ''AAA'' మల్టీఫ్లెక్స్ ను నిర్మించటం తెలిసిందే.

బన్నీ నిర్మించిన ఈ థియేటర్ ను తాజాగా అల్లు అర్జున్.. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కలిసి ప్రారంభించారు. థియేటర్ ఓపెనింగ్ కోసం వచ్చిన బన్నీని చూసేందుకు ఆయన అభిమానులు పోటెత్తారు.

బన్నీ వస్తారని తెలియటంతో ఉదయం నుంచి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూశారు. ఓపెన్ టాప్ జీపులో.. అమీర్ పేట చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చిన బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

దీంతో అమీర్ పేట మొత్తం జనసందోహంతో నిండిపోయింది. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ మల్టీఫ్లెక్సులో బోలెడన్ని విశేషాలు ఉన్నట్లు చెబుతున్నారు. అల్లుఅర్జున్ ప్రారంభించిన ఈ థియేటర్ లో మొదటి మూవీగా.. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ ను ప్రదర్శించనున్నారు.

ఈ మల్టీఫ్లెక్స్ ను అల్లు అర్జున్ నిర్మిస్తే.. గచ్చిబౌలితో  ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేశ్ బాబు ఏఎంబీ థియేటర్లను ఓపెన్ చేయగా.. విజయదేవరకొండ ఎవీడీ థియేటర్ ను నిర్మించారు. ప్రభాస్ సైతం తన స్నేహతులతో కలిసి ఒక థియేటర్ ను నిర్మించటం తెలిసిందే. బన్నీ థియేటర్ ఓపెన్ సంగతేమో కానీ.. అమీర్ పేట పరిసర ప్రాంతాల్లోని వాహనదారులు మాత్రం నానా అవస్థలకు గురయ్యారు. ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు పోలీసులు అమితంగా శ్రమించాల్సి వచ్చింది.



Full View

Similar News