సెట్ లో సెల్ఫీలు.. బన్నీకి చిర్రెత్తుకురాదా!

Update: 2017-01-31 04:24 GMT
ఈమధ్య కాలంలో సమయం, సందర్భం ఏమాత్రం పట్టించుకోకుండా రెగ్యులర్ గా చేసె పనిలో "సెల్ఫీ" ఒకటి! పెళ్లి, చావు అనే తారతమ్యాలు లేనిదే ఈ సెల్ఫీ! తాజాగా ఇలా సెల్ఫీలతో చెలరేగిపోతున్న మోడల్స్ కి గట్టి షాకే ఇచ్చాడంట స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. నిత్యం వీలైనంతవరకూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండే బన్నీకి ఉన్నట్టుండి కోపం రావడానికి దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం!

ఈమధ్య కాలంలో అల్లూ అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాకోసం సంగీత్ సీన్ లాంటిది ఒక షూట్ చేయాల్సి వచ్చిందట. దీనికోసం మంచి కలర్ ఫుల్ సెట్ రెడీ చేశారట. దీంతో ఈ సంగీత్ సీన్ లో యాక్ట్ చేయడానికి వచ్చిన మోడల్స్ అంతా షూటింగ్ గ్యాప్ లో సెట్ మొత్తం లీక్ అయ్యేలా సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారంట. దీంతో బన్నీకి చిర్రెత్తుకొచ్చిందట.

విషయం గ్రహించిన బన్నీ.. ఏమాత్రం మొహమాటం లేకుండా "షూటింగ్ వివరాలేమీ బయటకు వెళ్లడానికి వీల్లేదు, సో.. ఎవరూ సెల్ఫీలు అవీ తీసుకోవద్దు" అని నిర్మొహమాటంగా చెప్పేశాడట. బన్నీకి ఈ రేంజ్ లో కోపం వచ్చిందంటే... ఆ సెట్ లో జనాలు ఎలా రెచ్చిపోయి ఉంటారో!!

కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ "దువ్వాడ జగన్నాధమ్‌"(డి.జె.) షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయినట్లు సమాచారం!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News