బన్నీ.. ఫ్యాన్స్ ఎందుకు లేరబ్బా?

Update: 2017-06-29 17:06 GMT
ఒక స్టార్ హీరో ఓ ప్లేస్ కు వస్తున్నాడంటే.. అంతకంటే ముందే వందలాది మంది ఫ్యాన్స్ గుమిగూడిపోతారు. దక్షిణాదిలో.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హీరోలను దేవుళ్లుగా కొలిచేసే స్థాయిలో అభిమానం చూపిస్తారు. అలాంటిది అల్లు అర్జున్ ఓ ఈవెంట్ కు హాజరైతే.. చుట్టూతా కనీస మాత్రం అభిమానులు కూడా కనిపించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

రీసెంట్ గా అల్లు అర్జున్ తన తాత అల్లు రామలింగయ్య విగ్రహానికి పూల మాల వేసేందుకు వెళ్లాడు. విశాఖలోని నోవోటెల్ హోటల్ పరిసరాల్లో ఈ విగ్రహం ఉండగా.. కేవలం నిర్వాహకులు తప్ప ఫ్యాన్స్ ఎవరూ స్టైలిష్ స్టార్ దగ్గరలో కనిపించలేదు. కావాలనే ఫ్యాన్స్ ను దూరంగా ఉంచారని అనుకుందామంటే.. అదేమీ జనాలు తిరగని ప్రాంతం కాదు. రోజంతా రద్దీగా ఉండే ఏరియానే. అయినా సరే ఈ స్టార్ హీరోను చూసేందుకు అభిమానులు తరలిరాలేదంటే.. అందుకు కారణం ఉద్దేశ్యపూర్వకంగా బన్నీని దూరం పెట్టడమే అనే వాదన మొదలైంది.

మెగా ఫ్యాన్స్ లో ఓ వర్గం.. అంటే ప్రత్యేకించి పవన్ అభిమానులు 'చెప్పను బ్రదర్' ఉదంతం నుంచి బన్నీపై గుర్రుగానే ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను నెక్ట్స్ మెగాస్టార్ అని ప్రచారం జరుగుతుండడం.. మరో వర్గానికి అంతగా నచ్చడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే అల్లు అర్జున్ లాంటి స్టార్ వచ్చినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఇందులో నిజానిజాల సంగతేమో కానీ.. ఫోటోలు చూస్తుంటే మాత్రం ఇదంతా నిజమే అనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News