ముద్దు గన్‌ బుల్లెట్‌ బన్నీకి తగిలినట్లుంది

Update: 2019-01-21 11:26 GMT
గత సంవత్సరం సోషల్‌ మీడియాను కుదుపు కుదిపేసిన ప్రియా వారియర్‌ తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. తన మలయాళ చిత్రం 'ఒరు ఆదార్‌ లవ్‌' తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దం అయ్యింది. ఒరు ఆదార్‌ లవ్‌ ను 'లవ్‌ డే' పేరుతో డబ్బింగ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. 27 సెకన్ల ప్రియా వారియర్‌ టీజర్‌ రెండు కోట్ల వ్యూస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రియా వారియర్‌ ఆ మద్దు గన్‌, కన్ను గీటే షాట్స్‌ తో ఇండియా మొత్తం ఫేమస్‌ అయ్యింది. ప్రియా వారియర్‌ కు బన్నీ కూడా ఫిదా అయ్యాడేమో, అందకే లవ్‌ డే ప్రమోషన్‌ కు తన వంతు హ్యాండ్‌ ఇస్తున్నాడు.

'లవ్‌ డే' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని జే కన్వెన్షన్‌ లో ఈనెల 23న నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమంకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరు అయ్యేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరిన వెంటనే బన్నీ ఓకే చెప్పాడని తెలుస్తోంది. టాలీవుడ్‌ లో కూడా ప్రియా వారియర్‌ కు మంచి క్రేజ్‌ ఉన్న కారణంగా లవ్‌ డే సినిమాకు మంచి క్రేజ్‌ ఉంది. దానికి తోడు బన్నీ ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరు కాబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం.

చాలా రోజుల క్రితమే ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మలయాళ వర్షన్‌ తో పాటు తెలుగులో కూడా ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు మరియు మలయాళంలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Full View
Tags:    

Similar News