#AA21 ..స్టైలిష్ స్టార్ లుక్ ఫైన‌ల్ చేసి జేగంట మోగించాడు!

Update: 2021-02-25 05:40 GMT
#AA20 సెట్స్ లో ఉండ‌గానే #AA21 లుక్ ఫైన‌ల్ చేసి వేడి పెంచుతున్నారు కొర‌టాల‌.  ఓవైపు మెగాస్టార్ చిరంజీవి- చ‌ర‌ణ్ ల‌తో ఆచార్య చిత్రీక‌ర‌ణ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తూనే.. మ‌రోవైపు బ‌న్నీతో సినిమా కోసం ఇప్ప‌టి నుంచే తెలివైన ప్ర‌ణాళిక‌తో ముందుకెళుతున్నారు శివ‌.

ఆచార్య చిత్రీక‌ర‌ణ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసి తరువాత అల్లు అర్జున్ తో సెట్స్ కెళ్లేందుకు స‌ర్వ స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. ఈ సినిమా భారీ బ‌డ్జెట్ తో అత్యంత‌ భారీ స్థాయిలో నిర్మిస్తారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. స్టార్ డైరెక్టర్ కొర‌టాల టీమ్ బ‌న్ని చిత్రం కోసం పనిని ప్రారంభించింది. ఇప్ప‌టికే బన్నీ రూపాన్ని కూడా ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది. ఇంత‌కుముందే #AA21 ప్రీలుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. సెప్టెంబర్ ‌నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభమవుతుంది. బన్నీ ఈ చిత్రంలో అల్ట్రా-పోష్ అవతారంలో కనిపిస్తారు.

మ‌రోవైపు బ‌న్ని ప్ర‌స్తుతం `పుష్ప` చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆ మూవీలో పూర్తి మాస్ లుక్ తో క‌నిపించ‌నుండ‌గా కొర‌టాల కోసం పూర్తిగా క్లాస్ అవ‌తారంలో క‌నిపిస్తార‌ట‌. పుష్ప త‌ర‌హాలోనే కొర‌టాల‌ సినిమాలో డ్యూయ‌ల్ షేడ్ ఉంటుందా? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు.

మ‌హేష్ కి రెండు సార్లు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన కొర‌టాల ఎన్టీఆర్ కి రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రాన్ని ఇచ్చారు. ప్ర‌భాస్ కి మిర్చిలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చారు. ఇప్పుడు చిరు - చ‌ర‌ణ్ తో ప‌ని చేస్తున్నారు. ఈ కాంబినేష‌న్ మూవీ `ఆచార్య`‌కు బోలెడంత హైప్ వ‌స్తోంది. ఆ త‌ర్వాత బ‌న్నీకి వీళ్లంద‌రినీ మించిన‌ పెద్ద హిట్టివ్వాల‌న్న క‌సితో ప‌ని చేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News