బన్నీ సినిమాకు ముహూర్తం ఫిక్సా?

Update: 2018-10-27 05:56 GMT
అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఎన్నడూ లేనిదీ ఆరు నెలలు పైగా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత కొత్త సినిమా కోసం చాలా టైం ఖర్చు పెట్టాడు. విక్రం కుమార్ తో సినిమా ఓపెనింగ్ దాకా వెళ్ళబోయి డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. దీని గురించి అటు దర్శకుడు కాని ఇటు హీరో కాని ఎక్కడా ప్రస్తావించడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక త్రివిక్రమ్ తో చేయడం కోసమే అరవింద సమేత వీర రాఘవ విడుదల దాకా బన్నీ వెయిట్ చేసాడు అనే వార్తకు బలం చేకూర్చేలా అడుగులు పడుతున్నట్టు సమాచారం.

ఆ మేరకు అతి ముఖ్యులతో జరిపిన మీటింగ్ లో  అల్లు అరవింద్ డిసెంబర్ 11న ముహూర్తంగా సెట్ చేసినట్టు వినికిడి. గీత ఆర్ట్స్ బ్యానర్ యాభై శాతం షేర్ తో మిగిలింది ఇంకో సంస్థ అసోసియేషన్ తో నిర్మించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఇది బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. గత ఏడాది హిందిలో వచ్చిన ఒక సూపర్ హిట్ లవ్ ఎంటర్ టైనర్ ని అల్లు అర్జున్ ఇమేజ్ కి అనుగుణంగా అవసరమైన మార్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. మరి దానికే కట్టుబడతారా లేదా త్రివిక్రమ్ ఏదైనా కొత్త కథతో ముందు వస్తారా అనేది తేలడానికి ఇంకొంత టైం అయితే  పడుతుంది. అరవింద సమేత వీర రాఘవకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా పూర్తయ్యాయి కాబట్టి త్రివిక్రమ్ వెంటనే దీని కోసం రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.

కాకపోతే గీత ఆర్ట్స్ తో హారికా హాసినినే టై అప్ అవుతుందా లేక బన్నీ ఇంతకు ముందే కమిట్మెంట్ ఇచ్చిన వేరే నిర్మాత సీన్ లోకి వస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. జులాయి-సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత ఆ కాంబోలో వస్తున్న మూవీ అవుతుంది. ఒకే హీరోతో త్రివిక్రమ్ మూడు సినిమాలు చేయడం పవన్ కళ్యాణ్ తర్వాత బన్నీతోనే. 
Tags:    

Similar News