అసలు తమ ఊళ్ళో ఒక స్టార్ హీరో ఫంక్షన్ జరుగుతుందని ఆ గ్రామ ప్రజలైనా ఊహించారో లేదో కాని ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ ఆ లోటు తీర్చబోతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లలో తాడేపల్లిగూడెంకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధవరంలో ఈ రోజు సాయంత్రం నా పేరు సూర్య ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. కథ ప్రకారం ఇందులో హీరో దేశం అంటే ప్రాణమిచ్చే సైనికుడు కావడంతో ఇక్కడ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మెగాస్టార్ తో సహా ఆ కాంపౌండ్ హీరోలందరికీ అక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది. కాని సౌకర్యాలు సెక్యూరిటీ చేరుకునే వెసులుబాటు తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల షూటింగులు చేసినా వేడుకలు మాత్రం అక్కడ చేయలేకపోయారు. నా పేరు సూర్య ఆ కొరతను పూడ్చేసింది. ఇంటికొక్క సైనికుడు ఉంటాడని ప్రసిద్ధికెక్కిన మాధవరం అయితేనే కరెక్ట్ ఛాయస్ అని ఫీల్ అయిన అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం అక్కడి కుటుంబాలతో చర్చించాడు కూడా.
ఇప్పుడు గోదావరి జిల్లా మొత్తం ఇదే సందడి నెలకొంది. భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బన్నీ ఫాన్స్ సర్వం సిద్ధం చేసుకున్నారు. బ్యానర్లు దారి పొడవునా ఫ్లెక్సిలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద బైక్ ర్యాలీ కూడా ప్లాన్ చేసారు. విడిది నుంచి వేదికను చేరుకోబోయే అల్లు అర్జున్ వెంట ఇది నడుస్తుందని తెలిసింది. కొన్ని వందల జెండాలు జిల్లా వ్యాప్తంగా నాటారు. ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. వేదికపై యువతరానికి స్ఫూర్తి కలిగేలా మిలటరీ మాధవరం ఊరిలోని పెద్దలతో సైన్యంలో చేరాల్సిన ఆవశ్యకత గురించి ప్రసంగాలు ఇప్పించే విధంగా కూడా ప్రోగ్రాం ప్లాన్ చేసినట్టు తెల్సింది. బయట నుంచి ప్రత్యేకంగా అతిధులు ఎవరు రావడం లేదని సమాచారం. హైదరాబాద్ లో 29న జరిగే ప్రీ రిలీజ్ కు చిరంజీవితో సహా పలువురు మెగా హీరోలు హాజరయ్యే అవకాశం ఉంది. గోదావరి మొత్తం బన్నీ మయం అయిపోయింది.