ఈ ఏడాది సమ్మర్ కు ముందే బ్లాక్ బస్టర్ హిట్ తో మెగా అభిమానుల్లో ఖుషీ నింపాడు రామ్ చరణ్ తేజ్. రంగస్థలం మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు.. ఆడియన్స్ నుంచి ప్రశంసలు కొల్లగొట్టేస్తూ దూసుకెళ్తోంది. ఇదే ఊపులో మెగా అభిమానులను మరింత మురిపించేందుకు స్టయిలిష్ స్టార్ రెడీ అయిపోతున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. రిలీజ్ టైం దగ్గర పడుతుంటంతో ఈ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. 8న నా పేరు సూర్య డైలాగ్ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. సెటైరికల్ డైలాగులు చెప్పడంలోనూ.. పంచ్ లు పేల్చడంలో బన్నీ స్టయిలే వేరు. నాపేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ ఆవేశపరుడైన ఆర్మీ ఆపీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాలో డైలాగులు ఏ రేంజిలో ఉంటాయన్న దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తి ఎక్కువే ఉంది.
రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ నా పేరు సూర్య సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కేరళ బ్యూటీ అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే సైనికుల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమాలోని సైనిక పాట రిపబ్లిక్ డేకి రిలీజ్ చేశారు. ఇది చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు డైలాగుల్తో ఇంప్రెస్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.