అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదలకు రంగం సిద్ధం అయిపోతోంది. ప్రచార కార్యక్రమాలు కూడా వేగంగానే జరుగుతున్నాయి. మూవీ ఆడియో డిఫరెంట్ గా ఉండడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఒక భారీ వేడుకను నిర్వహించిన నా పేరు సూర్య టీం.. ఈ సారి హైద్రాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.
ఇప్పటివరకూ టాలీవుడ్ లో చూసిన సినిమా ఫంక్షన్స్ మాదిరిగా ఇది ఉండదట. ఎవరో డ్యాన్సర్లు వచ్చి నాలుగు పాటలకు డ్యాన్సులు వేయడం.. యాంకర్ నాలుగు జోకులు పేల్చడం.. వచ్చిన గెస్టులు ఓ పది పొగడ్తలు కురిపించడం.. చివరగా కోర్ టీం వచ్చి తామెంత కష్టపడ్డామో వివరించడం.. ఇప్పటివరకూ సినిమా ఫంక్షన్స్ తీరు ఇలాగే ఉంది. కానీ నా పేరు సూర్య విషయంలో ఈ ట్రెండ్ మారిపోనుందట. ఈ వేడుకలోకి బన్నీ ఎంట్రీనే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. బన్నీ ఆడిటోరియంలోకి వచ్చే ఒక్క సీక్వెన్స్ కోసమే 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారని తెలుస్తోంది.
ఇక స్టేజ్ పై సినిమా థీమ్ కు తగినట్లుగా బన్నీ కొన్ని జిమ్నాస్టిక్స్ ప్రదర్శిస్తాడట. దేశభక్తిని తట్టిలేపేలా ఉండే ఈ ఎపిసోడ్ మొత్తానికి అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఇంత ఖర్చు చేసి ఇలాంటివి చేయడమా అనుకుంటున్నారు పలువురు సినీ జనాలు. కానీ నా పేరు సూర్య మూవీ ఇతర చిత్రాల మాదిరిగా ఉండదని.. కొత్త తరహా కథాంశాన్ని క్యారెక్టర్లను చూపించబోతున్నపుడు.. ప్రచారం విషయంలో కూడా ఇలాంటి వినూత్న పంథాలు అవసరం అని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. అందుకే ఎంత ఖర్చుకైనా వెనుకాడ్డం లేదని తెలుస్తోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా వస్తున్న సంగతి తెలుసు కదా.