టాలీవుడ్ లో మిగిలిన హీరోలతో పోలిస్తే బన్నీ థింకింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందరిలా కాకుండా ఒక సినిమా అయిపోయిన తర్వాతే తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తాడు ఈ స్టైలిష్ స్టార్. ఇప్పుడు రచయిత వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య’ వంటి దేశభక్తి చిత్రాన్ని తీసిన అల్లుఅర్జున్ త్వరలో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తో సినిమాకి కమిట్ అయ్యాడట.
నేటి తరం దర్శకుల్లో విక్రమ్ సినిమాల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. మొదటి సినిమాగా ‘13 బీ’ వంటి సస్పెన్స్ హర్రర్ తీశాడు. తర్వాత ‘ఇష్క్’ అంటూ యూత్ ఫుల్ లవ్ స్టోరీ తెరకెక్కించిన విక్రమ్ కుమార్... ‘మనం’ సినిమాతో మూడు తరాల ముచ్చటైన ప్రేమకథను అపురూపంగా తెరకెక్కించాడు. సూర్యతో తీసిన ‘24’ ఓ ప్రయోగాత్మక చిత్రం. అఖిల్ తో ‘హాలో’ అంటూ మంచి ప్రేమకథ తీశాడు. విక్రమ్ కుమార్ తర్వాతి ప్రాజెక్టు న్యాచురల్ స్టార్ నానితో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ‘కృష్ణార్జున యుద్ధం’ ఫ్లాపు కావడంతో నాని... విక్రమ్ తో ప్రయోగం చేసేందుకు భయపడ్డాడు. దీంతో విక్రమ్ చూపు ఇప్పుడు బన్నీపై పడింది. బన్నీకి ఇప్పటికే కథ వినిపించాడని... విక్రమ్ నేరేషన్ కి ఇంప్రెస్ అయిన బన్నీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
ఈ సినిమాని డాక్టర్ వెంకటేశ్వర్ రావు- నల్లమలపు బుజ్జీ సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. ‘నా పేరు సూర్య’ ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విక్రమ్ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. ఓ వైపు కొరిటాల శివతో కూడా బన్నీ సినిమా చేసే అవకాశాలున్నాయమని వార్తలు వస్తున్నాయి. అయితే కొరిటాల- ప్రభాస్ తో మరోసారి పనిచేయాలని ఆశపడుతున్నాడు. సో... ఈ వార్తల్లో ఏది నిజమవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.