అందాల తార శ్రీదేవి ఇక మన మధ్య లేరు అనే చేదు నిజాన్ని అటు ఆమె కుటుంబ సభ్యులే కాదు యావత్ భారత దేశం జీర్ణించుకోలేకపోతోంది. ఆమె హఠాన్మరణమే ప్రజలను కలచివేస్తున్న ఈ సమయంలో మీడియా చేసే వ్యాఖ్యలు, రాసే కధనాలు ఫాన్స్ మరింత బాధిస్తున్నాయి.
కొందరేమో ఆమెకు చనిపోయే ముందు భర్త బోనీ తో పెద్ద గొడవ అయింది అని చెప్తున్నారు. మరి కొందరేమో ఆమె బాగా తాగేసి ఉందని అంటున్నారు. ఒకరు ఆమె చావు కి కారణం ఆమె చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ లు అంటుంటే మరొకరు ఆమె స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్లనే మృత్యువాత పడింది అంటున్నారు. ఒకరు అసలు ఆమెది ఆత్మహత్య అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ వినలేక ఇంకా చాలు ఆపండి అంటూ ఫాన్స్ గగ్గోలు పెడుతున్నారు. సెలెబ్రిటీలు సైతం కొంత సంయమనం చూపండి అని కోరుతున్నారు. అల్లు అర్జున్ కూడా దీనిపై సోషల్ మీడియా లో స్పందించారు. "మీడియా కు, సోషల్ మీడియా కంటెంట్ ప్రొవిడర్లకు ఇది నా వినాయపూర్వకమైన రిక్వెస్ట్. చాలా తప్పుడు కధనాలు వెలువడుతూ ఉన్నాయి. అందరిని చనిపోయిన ఆమెపై గౌరవం చూపమని కోరుతున్నాను. థాంక్యూ" అంటూ ట్వీట్ చేశాడు.
అల్లు అర్జున్ మాత్రమే కాదు ఇంతకు మునుపు కూడా కొందరు మీడియా ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని దయచేసి ఇలాంటివి చేయొద్దని అభ్యర్దించారు. కాజల్ కూడా ఊహాగానాలు ఆపమని కోరగా, రానా ఆమె కు కళంకం తీసుకురావద్దని కోరాడు. మెహ్రీన్ పిర్జాద - అల్లు శిరీష్ - రకుల్ ప్రీత్ - హరీష్ శంకర్ - సుధీర్ బాబు వక్కంతం వంశీ, రాయ్ లక్ష్మీ, నాని #లెట్ హర్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ హ్యాష్ ట్యాగ్ మెసేజ్ పెట్టారు. కానీ ఎంత మంది వారించినా మీడియా తగ్గుతుందా? ఈ తప్పుడు న్యూస్ లను ప్రచారం చేయడం ఆపుతుందా? చూద్దాం.