''రాక రాక చిరంజీవి గారు మరోసారి తెరమీద కనిపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు తరువాత ఆయన స్ర్కీన్ మీద కనిపిస్తుంటే.. ఇప్పుడు దానిని వారం పోస్టుపోన్ చేయమంటే కష్టం. నేను ఆగలేను'' అంటున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. మనోడు మెగాస్టార్ కు డయ్ హార్డ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ఈ బ్రూస్ లీ రిలీజ్ క్లాష్ విత్ రుద్రమదేవి గురించి స్పెషల్ వీడియో బైట్ రిలీజ్ చేసిన బన్నీ.. ఈ విషయంపై మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు.
''అసలు బ్రూస్ లీ మూడు నెలల ముందే ఫిక్సయ్యింది. కాని దురదృష్ఠ వశాత్తూ రుద్రమదేవి సెప్టెంబర్ 4న రాకపోవడంతో.. తప్పక అక్టోబర్ 9 వచ్చింది. పండగ సీజన్ కాబట్టి..సినిమాలు బాగుంటే రెండూ ఆడతాయ్ అనే ఉద్దేశ్యంతో దిగారు. అందుకు ఇప్పుడు బ్రూస్ లీని వాయిదా వేయమనడం ఫేర్ కాదు. పండగ సీజన్ కు మామూలు సీజన్ కు రెవెన్యూలో తేడా ఉంటుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వాయిదా వేయమనడం తప్పు'' అంటూ మరోసారి తన మనస్సులోని మాటను చెప్పాడు.
మొన్న సేమ్ టు సేమ్ ఇదే విషయం ట్విట్టర్ స్టేట్మెంట్ లో చెప్పిన బన్నీ.. బహుశా ఇప్పుడు అభిమానుల నుండి ప్రెజర్ వలన అనుకుంట.. దానిని వీడియో గా కూడా రికార్డు చేసి మరీ వినిపించాడు.