బ‌న్నీ క్రేజ్ ను HBO భలే వాడుకుంటోంది

Update: 2018-05-01 10:29 GMT
మామూలుగా అయితే ఇంగ్లీషు ఛానెళ్ల‌లో తెలుగు సినిమాల ప్ర‌క‌ట‌న‌లు రావు. తెలుగు హీరోల ప్ర‌క‌ట‌న‌లూ క‌నిపించ‌వు. తెలుగు ఛానెల్ లో బ‌న్నీ క‌నిపించే ఫ్రూటీ యాడ్ కూడా హిందీ- ఇంగ్లీష్ ఛానెల్ కి వెళ్లే స‌రికి అలియా భ‌ట్ క‌నిపిస్తుంది. అయితే బ‌న్నీ మాత్రం ఈసారి ప‌ద్ద‌తి మార్చాడు. త‌న తాజా సినిమా ‘నా పేరు సూర్య‌’ ట్రైల‌ర్ ని ప్ర‌ముఖ ఆంగ్ల ఛానెల్ హెచ్‌బీవోలో ప్ర‌మోట్ చేస్తున్నాడు.

అయితే తాజాగా హెచ్‌బీవో గురించి వ‌స్తున్న ప్రోమో వీడియాలో బ‌న్నీ క‌నిపించ‌డంతో అవాక్క‌వ్వ‌డం తెలుగు ప్రేక్ష‌కుల వంత‌య్యింది. హోమ్ బాక్స్ ఆఫీస్ అంటూ హెచ్‌బీవో ఛానెల్ లో వ‌చ్చే సినిమాల గురించి ప్ర‌మోట్ చేస్తూ క‌నిపించాడు బ‌న్నీ. ఒక తెలుగు హీరో ఆంగ్ల ఛానెల్ ను ప్ర‌మోట్ చేయ‌డ‌మంటే విశేష‌మే. నిజానికి త‌న సినిమాని జాతీయ స్థాయిలో ప్ర‌మోట్ చేసేందుకు  స‌ద‌రు ఇంగ్లీషు ఛానెల్ ని ఆశ్ర‌యించాడు బ‌న్నీ. అయితే ఆ ఛానెల్ మాత్రం బ‌న్నీ క్రేజ్ ను ఛానెల్ ప్ర‌మోష‌న్ కి వాడుకుంటోంది. ఇది బ‌న్నీకి లాభ‌మే. ఇంత‌వ‌ర‌కూ కేర‌ళ‌- తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైన బ‌న్నీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అవుతాడు. సినిమాకీ కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ. ద్వంద లాభ ప‌ద్ద‌తి అంటే ఇదేనేమో!

తెలుగు- త‌మిళ‌- మ‌ల‌యాళ భాష‌ల్లో మే 4న విడుద‌ల సిద్ధ‌మ‌వుతోంది ‘నా పేరు సూర్య‌’. త్వ‌ర‌లో హిందీలోనూ డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. త్వ‌ర‌లో హిందీ వెర్ష‌న్‌ విడుద‌ల తేదిని కూడా క‌న్ఫార్మ్ చేయాల‌ని భావిస్తోంది చిత్ర బృందం. బ‌న్నీ డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్ సినిమాలు యూట్యూబ్ లో రికార్డు లెవెల్లో వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News