బ‌న్నీని ప‌ది మెట్లు పైకెక్కించిన సుక్కూ!

Update: 2021-12-19 11:32 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప- ది రైజ్` పై నెగెటివిటీని ప‌క్క‌న‌బెట్టి చూస్తే.. న‌ట‌న ప‌రంగా బ‌న్నీ మ‌రో ప‌ది మెట్లు ఎక్కాడ‌న్న టాక్ వినిపించింది. పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ ఏ స్థాయి పెర్పార్మెన్స్ ఇచ్చాడ‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా సినిమా రిలీజ్ కి ముందు బ‌న్నీ ఓ మాట అన్నారు. `నాకు త‌గ్గ పాత్ర దొరికితే ఆ పాత్ర‌లోకి  ముందుగా ప‌రకాయ ప్ర‌వేశం చేసేయ‌డ‌మే తెలిసింద‌ల్లా. ద‌ర్శ‌కుల విజన్ కి త‌గ్గ‌ట్టు న‌న్ను నేను మార్చుకుంటూ షైన్ అవుతుంటా. ఇది నా కృషి కాదు. ద‌ర్శ‌కులు నాకు క‌ల్పించిన అవ‌కాశం..క్రియేటివిటీ మాత్ర‌మే. ఎలాంటి పాత్ర‌లోనైనా ద‌ర్శ‌కుల్ని మెప్పించాలి. `పుష్ప` సినిమా కోసం చాలా ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేసాను. ది బెస్ట్ ఇచ్చాన‌ని న‌మ్మ‌తున్నా`` అని అన్నాడు.

ఇప్పుడు `పుష్ప` సినిమా చూసొచ్చిన త‌ర్వాత ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఆ  మాట‌లు డాబు కోసం అన‌లేద‌ని అర్ధ‌మ‌వుతోందని కితాబిస్తున్నారు.  బ‌న్నీ ద‌ర్శ‌కుల హీరో అని  మ‌రోసారి నిరూపించాడు. సినిమా హిట్..ప్లాప్ అన్న సంగ‌తిని ప‌క్క‌న‌బెడితే సుకుమార్ త‌న‌కు  అప్ప‌గించిన  బాధ్య‌త‌ని మాత్రం నూటికి నూరుశాతం నెర‌వేర్చార‌ని పొగిడేస్తున్నారు. కొన్ని పాత్ర‌లు వెండి తెర‌పై కొంద‌రు మాత్ర‌మే పోషించ‌గ‌ల‌రు.  అలాంటి పాత్ర‌ల్లో పుష్ప‌రాజ్ పాత్ర ఒక‌టి. పాత్రకి ప్రాణ ప్ర‌తిష్ట చేసాడు బ‌న్నీ.  `పుష్ప‌`లో బ‌న్నీ రివ‌ర్టింగ్  పెర్మార్మెన్స్ తో పాత్ర‌కి ఓ హుందా త‌నాన్ని తీసుకొచ్చాడు అన్న ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది.

చిత్తూరు మాండ‌లికం నుంచి రోజువారీ కూలీ పాత్ర వ‌ర‌కూ సునాయాసంగా పోషించ‌గ‌లిగాడు. యాక్ష‌న్ స‌న్నివేశాలు..రొమాంటిక్ స‌న్నివేశాల్లో  సైతం త‌గ్గేదేలా అని నిరూపించాడు. సినిమాకి నెగిటివ్ రివ్యూలు వ‌చ్చినా బ‌న్నీ బ్రాండ్ ఇమేజ్.. సినిమాలో త‌న న‌ట‌నే ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ వైపు ప‌రుగులు పెట్టిస్తోంద‌ని అంటున్నారు. న‌టుడిగా బ‌న్నీని -సుకుమార్ ఓ ప‌ది మెట్లు పైకి ఎక్కించాడని  ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. రంగ‌స్థ‌లంలో చిట్టిబాబులా..బ‌న్నీ పుష్ప‌రాజ్ పాత్ర‌ ఎప్ప‌టికీ గుర్తిండిపోతుంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆర్య - ఆర్య 2లో బ‌న్నీని ఎంతో వైవిధ్యంగా చూపించిన సుకుమార్ ఈసారి కూడా ఫెయిల్ కాలేద‌న్న ప్ర‌శంస ద‌క్కుతోంది.
Tags:    

Similar News