స్టయిలందు బన్నీ స్టయిలే వేరయా!!

Update: 2018-02-16 04:25 GMT
అల్లు అర్జున్ అంటేనే స్టయిల్ కు మారుపేరు. సినిమాల్లో బన్నీ స్టయిలిష్ అప్పియరెన్స్ కే అతడికి ఫ్యాన్స్ గా మారిన యూత్ ఎంతో మంది ఉన్నారు. జులాయిలో ఆకతాయిగా కనిపించే యువకుడి పాత్రే అయినా.. సన్నాఫ్ సత్యమూర్తిలో కుటుంబ బాధ్యతను మోసే వ్యక్తిగా అయినా తనదైన స్టయిల్ కనిపిస్తూనే ఉంటుంది.

బన్నీతాజాగా నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇందులో కుటుంబం కన్నా దేశానికి ప్రాధాన్యమిచ్చే ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అర్జున్ తన గెటప్ మొత్తం మార్చేశాడు. అసలు సిసలైన మిలటరీ ఆఫీసర్ లా డిప్ప కటింగ్ చేయించేశాడు. ఇదే లుక్ తో ఫేమస్ మాగ్గిమ్ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేశాడు. గెటప్ మారినా అల్లు అర్జున్ ముఖంలో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఫొటోషూట్ లో కొత్తగానే కాదు.. మరింత స్టయిలిష్ గా కనిపించాడంటూ ఫ్యాన్స్ కితాబు ఇచ్చేస్తున్నారు. స్టయిలిష్ స్టార్ అనే తన బిరుదును సార్ధకం చేసుకున్నాడని.. అలాగే స్టయిలందు బన్నీ స్టయిలు వేరయా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రైటర్ వక్కంతం వంశీ దర్శత్వంలో నాపేరు సూర్య సినిమా తెరకెక్కుతోంది. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై శిరీషా శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మళయాళ బ్యూటీ అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

Full View




Tags:    

Similar News