కామెంట్: సడన్ రైజ్ ఆఫ్‌ బన్నీ

Update: 2017-06-16 11:34 GMT
మొన్నమొన్నటివరకు రామ్ చరణ్ అండ ఎన్టీఆర్ సినిమాలు పెద్ద హిట్లు అయ్యేవి కాని.. అల్లు అర్జున్ సినిమాలు మాత్రం వీరి మూవీస్ కంటే కాస్త తక్కువే వసూలు చేసేవి. అయితే ఇప్పుడు అతని లేటెస్టు సినిమాలు చూస్తుంటే మాత్రం.. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా కూడా వాటికి 75+ కోట్ల షేర్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్  అనిపించట్లేదు. ఇప్పుడు కొత్త సినిమా డిజె దువ్వాడ జగన్నాథమ్ విషయంలో చూస్తుంటే.. అసలు ఈ సడన్ రైజ్ ఆఫ్‌ బన్నీ ఎలా కుదిరిందీ అంటూ అందరూ ఆశ్చర్యపోకతప్పదు.

నిజానికి పవన్ కళ్యాణ్‌.. మహేష్‌ బాబులు ఒక టాంప్ రేంజుకు వచ్చేశాక.. వారి వెనుకనే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్‌ ఉన్నప్పుడు.. అసలు ఈ హీరోలకంటే తాను ఇంకా ప్రత్యేకం అని చెప్పాలని అల్లు అర్జున్ పెద్ద ప్రయత్నాలే చేశాడు. ఎలాగో తన డ్యాన్స్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు కాబట్టి.. ఆ అభిమాన గణాన్ని భారీ స్థాయిలో పెంచుకున్నాడు. వైజాగ్లో ఫ్యాన్సీ మీట్లకు ప్రత్యేకంగా అటెండ్ కావడం నుండి.. ఒక సీనియర్ ఫ్యాన్ కు అనారోగ్యం కారణంతో ఆపరేషన్ జరిగితే.. ఆయన్ను పర్సనల్ గా వెళ్ళి చూసొచ్చాడు. ఇదంతా కేవలం మెగా ఫ్యాన్స్ నే కాకుండా.. ఇతర సీనియర్ హీరోల అభిమానులను కూడా బన్నీ అభిమానులుగా మారేలా చేసింది. అలాగే సోషల్ మీడియాలో మనోడు ఒక స్పెషల్ టీమ్ సాయంతో తన ఇమేజ్ ను డబుల్ చేసుకున్నాడు. ఈరోజున సోషల్ మీడియాలోని అన్ని ఎకౌంట్స్ లో ఉన్న ఫాలోవర్లను కలిపి చూస్తే.. బన్నీకే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. సో ఇతగాడి ట్రైలర్ ఒకటి రిలీజైందంటే.. ఇన్నాళ్ళూ పవన్ కళ్యాణ్‌ టీజర్లకు ఎంతటి గిరాకీ ఉందో.. అదే రేంజులో బన్నీ టీజర్లకూ వచ్చేసింది. అందుకే పవన్ కాటమరాయుడు టీజర్స్ కంటే డీజె దువ్వాడ టీజర్లకు వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి.

బాక్సాఫీస్ కలక్షన్లపరంగా కూడా బన్నీ ఇప్పుడు పవన్ మహేష్‌ రేంజులోనే దున్నేస్తున్నాడు. కాని ఒక ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటివరకు బన్నీ మాత్రం భారీ ఫ్లాపులు తినేసి తన సినిమాలకు భారీ నష్టం జరగకుండా బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. రొటీన్ కంటెంట్ అని అందరూ అంటున్నా కూడా.. సేఫ్‌ గేమ్ ఆడుతూ.. నిర్మాతలకూ పంపిణీదారులకూ డార్లింగ్ అయిపోతున్నాడు. ఇక మిగతా మెగా హీరోల తరహాలో ఒక సినిమా రిలీజై దాని రిజల్టు చూసుకుని తదుపరి సినిమా మొదలెట్టే పద్దతిని ఫాలో అవ్వకుండా.. డిజె మొద్దలవ్వకుండానే నా పేరు సూర్య స్టార్ చేశాడు. అంటే గ్యాప్ లేకుండా పనిచేయడానికి నేను రెడీ అంటూ అందరికీ క్లారిటీగా చెప్పినట్లే. దానితో తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసే ఛాన్సుంటుంది. అప్పుడు ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ ఫీలవుతారు.

ఒకవేళ డిజె దువ్వాడ జగన్నాథమ్ అందరూ అంచనాలు వేస్తున్నట్లు 100 కోట్లు షేర్ వసూలు చేస్తే మాత్రం.. బన్నీ గ్రాఫ్‌ గణణీంగా అద్భుతమైన స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనోడు మెగాస్టార్ చిరంజీవి సరైన వారసుడిలా.. జూ.మెగాస్టార్ అయిపోయినా అవ్వచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News