#అల‌.. రెండు జంట‌లు మ‌త‌ల‌బేంటి?

Update: 2020-01-11 13:59 GMT
అల వైకుంఠ‌పుర‌ములో రిజ‌ల్ట్ కి సంబంధించిన రిపోర్ట్ మ‌రి కాసేప‌ట్లనో ఓవర్సీస్ నుంచి అంద‌నుంది. థ‌మ‌న్ మ్యూజిక్ తోనే ఈ సినిమాకి స‌గం స‌క్సెస్ ద‌క్కింది అంటూ బ‌న్ని అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్న వేళ రేప‌టి రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఉత్కంఠ నెల‌కొంది. సంక్రాంతి పందెంలో ఠఫ్ కాక్ అంటూ ప్ర‌చారం సాగింది కాబ‌ట్టి అల వైకుంఠ‌పుర‌ములో బృందంపై తీవ్ర ఒత్తిడి నెల‌కొంది.

ఇక పోటీబ‌రిలో నువ్వా నేనా? అంటూ ప్ర‌చారానికి దిగుతున్న అల టీమ్ సామాజిక మాధ్య‌మాల్లోనూ ప్ర‌చారం అద‌ర‌గొట్టేస్తోంది. ఓవైపు ఈ సినిమాలో టైటిల్ పాత్రధారిగా న‌టించిన పూజా హెగ్డే మ‌రింత యాక్టివ్ గా ప్ర‌మోష‌న్ చేస్తోంది. సామాజిక మాధ్య‌మాల్లో లేటెస్ట్ ఫోటోల్ని షేర్ చేస్తోంది. అలా అల షేర్ చేసిన ఫోటోలో రెండు జంట‌లు ముచ్చ‌ట గొలుపుతున్నాయి.

బ‌న్ని- పూజా జంట‌.. సువాంత్ - నివేధ జంట సంథింగ్ హాట్ గా ప‌ర్ఫెక్ట్ గానే కుదిరారు. బ‌న్ని-సుశాంత్ బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య సాగే క‌న్ఫ్యూజ‌న్ ఎలిమెంట్ ప్ర‌ధాన ఇతివృత్తం అని చెబుతున్నారు కాబ‌ట్టి.. సుశాంత్ పాత్ర‌కు పెద్ద స్కోప్ ఉంటుంద‌నే భావిస్తున్నారు. క‌ర్ణుడిలా దాన‌మిచ్చే కుర్రాడిగా బ‌న్నీని చూపిస్తున్నాన‌ని అంటున్నాడు కాబ‌ట్టి ఆస్తుల్ని సుశాంత్ కి వ‌దులుకునే కుర్రాడిగా బ‌న్ని క‌నిపిస్తాడా?  అన్న‌ది చూడాలి. అన్నిర‌కాలుగా మాయావి గుట్టు విప్పే టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది. జ‌స్ట్ కొన్ని గంటల్లోనే ప్రీమియ‌ర్ల నుంచి అల వైకుంఠ‌పుర‌ములో తొలి రిపోర్ట్ అందుకునే ఛాన్సుంది... జ‌స్ట్ వెయిట్..


Tags:    

Similar News