భానుమ‌తికే ఐస్ పెట్టాడే!

Update: 2018-12-17 17:32 GMT
భార‌త‌ దేశంలోనే బెస్ట్ డ్యాన్స‌ర్ల‌ లో ఒక‌రు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అత‌డి డ్యాన్సుల‌కు ఫ్యాన్స్ కాని వారే ఉండ‌రు. బ‌న్నీలా డ్యాన్సులు వేయాల‌ని క‌ల‌లుగ‌నే యూత్ ఉంటారు. బ‌న్నిని ఇమ్మిటేట్ చేసే డ్యాన్స్ మాష్ట‌ర్లు - డ్యాన్స‌ర్లు కోకొల్ల‌లు. ప్ర‌భుదేవా అంత‌టి గ్రేట్ డ్యాన్స‌ర్ ..  బ‌న్ని డ్యాన్సులు ఎంతో స్టైలిష్‌ గా ఉంటాయ‌ని పొగిడేశారంటే అర్థం చేసుకోవాలి. ఎంత హార్డ్ వ‌ర్క్ చేస్తాడో బ‌న్ని అంత గొప్ప‌గా ప్రెజెంటేష‌న్ ఇవ్వ‌గ‌ల‌డు. అందుకే స్టైలిష్ స్టార్‌ గా ఇంతింతై అన్న చందంగా ఎదిగాడు. కేవ‌లం టాలీవుడ్ లోనే కాకుండా అటు మాలీవుడ్, కోలీవుడ్‌ లోనూ అభిమానం సంపాదించుకున్నాడు.

అలాంటి గొప్ప డ్యాన్సింగ్ స్టార్ ఎలాంటి భేష‌జం లేకుండా.. ఓ హీరోయిన్ డ్యాన్సుల గురించి పొగిడేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది.  నేటి సాయంత్రం శిల్ప‌క‌ళా వేదిక సాక్షిగా సాయిప‌ల్ల‌వి జీవితం ధ‌న్య‌మైంది. `పడి ప‌డి లేచే మ‌న‌సు` ఈవెంట్ సాక్షి గా ఫిదా బ్యూటీ భానుమ‌తిని విప‌రీతంగా పొగిడేశాడు బ‌న్ని. ఈ పొగ‌డ్త‌ల‌న్నీ ఎంతో జెన్యూన్‌ గానూ అనిపించాయి. సాయి ప‌ల్ల‌వి న‌ట‌నే కాదు.. త‌న డ్యాన్సులు అంటే ఎంతో ఇష్టం అనీ బ‌న్ని అన్నాడు.

సాయి ప‌ల్ల‌వి తో డ్యాన్స్ చేయాలని ఉంద‌ని ఓపెన్ అయిపోయాడు. సాయి ప‌ల్ల‌వి తో న‌టించాలి అన్న‌ది అటుంచితే త‌న‌ తో క‌లిసి డ్యాన్స్  చేయాలి!! అని అన్నాడు. త‌న డ్యాన్స్‌ కి పిచ్చి ఫ్యాన్‌ని.. ఫిదాలో  పిల్లా న‌చ్చిందే సాంగ్ ఎన్నో సార్లు చూశాను. అన్ని సార్లు సాయి ప‌ల్ల‌వి కూడా ఆ పాట‌ను చూసి ఉండ‌దేమో! అంటూ కితాబిచ్చేశాడు. స్టైలిష్ స్టార్ అంత‌టి వాడే త‌న‌ని ఐస్ చేసేసే స‌రికి సాయి ప‌ల్ల‌వి ఆ వేదిక‌పైనే ఫ్రీజ్ అయిపోయింది. అంతా బాగానే ఉంది కానీ, సాయిప‌ల్ల‌విని అంత‌గా అభిమానించే బ‌న్ని తన సినిమాలో ఓ ఛాన్సివ్వొచ్చు క‌దా! అని  ఫ్యాన్స్ అంతే ఫ్రీజ్ అయిపోయారు.
Tags:    

Similar News