బన్నీ డీజేగా మారాడు. డీజే అంటే దువ్వూరి జగన్నాథమ్ అని అర్థం. మరి ఈ జగన్నాథమ్ చేసే సౌండ్లు - రీ సౌండ్లు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ముహూర్తపు షాట్ లోనే ఆయన పేల్చిన ఓ పంచ్ భలే సౌండింగ్ గా అనిపించింది. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో డీజే సినిమా షూటింగ్ మొదలయింది. అల్లు అర్జున్‌పై తీసిన ఫస్ట్ షాట్‌కి అల్లు అరవింద్ క్లాప్ నిచ్చారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫస్ట్ షాట్ లో బన్నీ `ప్రపంచం పచ్చగా ఉండాలి, మా అందరి జేబులు కష్టపడకుండానే నిండాలి... సర్వేజనా సుఖినోభవంతు` అంటూ డైలాగ్ చెప్పాడు.
దీన్నిబట్టి హీరో క్యారెక్టరైజేషన్ ని హరీష్ ఎలా డిజైన్ చేసుంటాడో అర్థం చేసుకోవచ్చు. విశ్వసనీయ వర్గాలు సమాచారం మేరకు ఈ సినిమాలో బన్నీ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటించనున్నట్టు తెలిసింది. దిల్ రాజు తన సంస్థలో 25వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే వేసవికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.