మన టాలీవుడ్ హీరోల్లో ఫ్యామిలీకి బాగా ప్రయారిటీ ఇచ్చేవాళ్లలో అల్లు అర్జున్ ఒకడు. మీడియాతో ఎప్పుడు మాట్లాడితే తన భార్య గురించి.. ముఖ్యంగా తన కొడుకు అయాన్ గురించి చాలా ముచ్చట్లు చెబుతుంటాడు బన్నీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ముద్దుల కొడుకుకు సంబంధించి ఓ శాడ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాడు బన్నీ. లేక లేక ఒక రోజు తన కొడుక్కి తాను స్వయంగా స్నానం చేయించబోయి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు బన్నీ చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ గురించి బన్నీ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘గత రెండేళ్లలో అయాన్ ను నేను స్వయంగా స్నానం చేయించింది ఒక్కసారి మాత్రమే. ఐతే స్నానం చేయించాక బాత్రూం నుంచి బయటికి తీసుకొచ్చి.. నేను మ్యాట్ మీద నిలబడి.. తనని నా కాళ్ల మధ్యలో నిలబెట్టుకున్నాను. అంతే.. సడెన్ గా జారిపోయాడు. వెనక్కి బోర్లా పడ్డాడు. తలకి గట్టిగా తగిలింది. గుక్కపట్టి ఏడ్చేశాడు. దాంతో పాటు తిన్నది మొత్తం కక్కేశాడు. నేను షేకైపోయాను. కొద్ది సేపటి తర్వాత నార్మల్ అయ్యాడు. అయినా ఎందుకైనా మంచిదని తర్వాతి రోజు హాస్పిటల్ కు తీసుకెళ్లి చెక్ చేయించాం. ఏం కాలేదని చెప్పారు. హమ్మయ్యా అనుకున్నాం.
‘నిన్ను నమ్మి రెండు రోజులు బాబును అప్పగిస్తేనా..’ అంటూ మా ఆవిడ సీరియస్ అయింది. అప్పుడర్థమైంది.. పిల్లల్ని మేనేజ్ చేయడం.. పెంచడం ఎంత కష్టమో. మేం హైదరాబాద్ లో ఉన్నపుడు అయాన్ ను చాలామంది చూసుకుంటారు. కానీ విదేశాలకు వెళ్తేనే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఒక మనిషిని తీసుకెళ్లినా సరే.. స్విమ్మింగ్ పూల్ లోకి దిగినప్పుడో.. జూకి వెళ్లినప్పుడో మనమే జాగ్రత్తగా ఎత్తుకోవాలి కదా. అప్పుడు నా చేతులు మామూలుగా నొప్పి పుట్టవు. మామూలుగా మాకైతే సాయానికి చాలామంది ఉంటారు. కొంతమంది ఎవ్వరి సాయం లేకుండా పిల్లల్ని పెంచుతారు అలాంటోళ్లకు సెల్యూట్ కొట్టాల్సిందే’’ అన్నాడు బన్నీ.