లేడీ డైరెక్టర్ ని బన్నీ అన్ని తిట్టాడా?

Update: 2016-03-02 13:30 GMT
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ కి.. ఆ కుటుంబంలో ఉన్న ఇతర హీరోల మాదిరిగానే.. ఇతరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడనే గుర్తింపు ఉంది. ఎప్పుడూ అల్లరిగా కనిపించినా.. ప్రవర్తనలో మాత్రం బన్నీకి సాటి వచ్చేవారు ఎవరూ ఉండరంటారు. అలాంటిది బన్నీ తనని తిట్టాడని చెప్పింది దర్శకురాలు నందినీ రెడ్డి. ఈ డైరెక్టర్ తన తొలి మూవీ అలా మొదలైంది సూపర్ హిట్ సాధించడంతో.. అదే ఊపుతో రెండో సినిమా జబర్దస్త్ చేసింది. కానీ ఆ చిత్రం దారుణంగా ఫెయిల్ అయింది.

నందినీ రెడ్డిని తీవ్ర నిరాశకు కూడా గురిచేసింది. ఈ సమయంలో నందినీ రెడ్డికి అల్లు అర్జున్ నుంచి మొదటగా ఫోన్ వచ్చిందట. తనను కలవాల్సిందిగా చెప్పాడట అల్లు అర్జున్. 'తనని కలవమంటూ నాకు ఫోన్ చేసిన బన్నీ, కేవలం ఒక్క ఫ్లాప్ తో నిరాశలో కూరుకుపోవడాన్ని వ్యతిరేకించాడు. కొత్తగా ఏమీ రాయకుండా సైలెంట్ గా ఉండడంతో తిట్టాడు కూడా. కొత్త స్టోరీలు రాయాలంటూ నాలో స్ఫూర్తి నింపిన బన్నీ.. నేను చెప్పిన ప్రతీ కథనీ వినివేడు. తన అభిప్రాయం చెబుతూ నన్ను ప్రోత్సహించాడు. నేను మానసికంగా రికవర్ కావడానికి బన్నీయే కారణం' అంటూ చెప్పిందీ డైరెక్టర్.

అలా రికవర్ అయిన తర్వాత నందినీ రెడ్డి తీసిన చిత్ర కళ్యాణ వైభోగమే. ఈ నెల 4న విడుదల కానున్న ఈ మూవీపై.. ఇండస్ట్రీలో చాలానే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News