ఇకపై 'ఆహా' వేరే లెవెల్లో ఉంటుంది: అల్లు అర్జున్

Update: 2021-11-03 04:20 GMT
తెలుగు ఓటీటీ రంగంలో 'ఆహా' కొత్త సొగసులు సంతరించుకుంటూ ముందుకు వెళుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యాప్ కి మరిన్ని హంగులు అద్దుతూ .. కొత్త కాన్సెప్టులతో తీర్చిదిద్దుతూ స్పీడ్ పెంచుతున్నారు. ఈ సందర్బంగా నిన్న రాత్రి 'ఆహా 2.0' ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ .. "మేము ఇలాగా ఒక తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేయాలనుకుంటున్నామన్న వెంటనే .. మాకు సపోర్టు కావాలన్న వెంటనే .. మాతో పాటు ముందడుగు వేసిన దిల్ రాజుగారికి సభాముఖంగా అభినందనలు తెలియజేసు కుంటున్నాను.

మాకు క్రియేటివిటీ పరంగా గానీ .. మోరల్ గా గానీ .. ఏదైనా గానివ్వండి .. మమ్మల్ని ఎంతో సపోర్టు చేసిన మా వంశీ పైడిపల్లి గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన గైడెన్స్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇక ఈ హోల్ 'ఆహా'ను ఇది తప్ప వేరే ధ్యాసే లేదన్నట్టుగా ఒక 'రేసుగుర్రం'లా పరిగెత్తించిన .. పనిచేసిన అజిత్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు 'ఆహా' టీమ్ లేకపోతే నెంబర్ వన్ ఓటీటీ గా నిలిచే ప్రసక్తే లేదు. ఈ క్రెడిట్ వారికే వెళుతుంది. టీమ్ లోని ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ చెబుతున్నాను.

ఇప్పటివరకూ మీరు చూసిన 'ఆహా' ఛానల్ ది ఒక రేంజ్ .. ఇక నుంచి వేరే లెవెల్లో వెళుతుంది. ఎందుకంటే వెర్షన్ 2.0 వస్తోంది. 'ఆహా వెర్షన్ 2.0 అని ఉంటుంది. మీరు మామూలుగా యాప్ ఓపెన్ చేస్తారు .. సినిమాలు చూస్తారు గదా .. ఇది ఇంకా ఈజీ. మీకు పెద్దగా చదవడం రాకపోయినా .. చాలా తేలికగా ఎక్కడ ఏదుందో పట్టేయగలరు. ఎక్కడ సినిమాలు ఉన్నాయి .. ఎక్కడ షోలు ఉన్నాయి అనేది చాలా తేలికగా మీకు తెలిసిపోతుంది .. ఇది చాలా గొప్ప సాఫ్ట్ వేర్. నేను చూశాను గనుక హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాను.

ఈ విషయంలో నేను మా అన్నయ్య బాబీకి కంగ్రాట్స్ చెప్పాలి. అన్నయ్యను ఉద్దేశించి .. " నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఏదో నా సొంత బ్రదర్ కాబట్టి నేను ఈ క్రెడిట్ ఇవ్వడం లేదు. నువ్వు సినిమాల్లో పుట్టి పెరిగావు .. సినిమాలపై నీకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. నువ్వు సాఫ్ట్ వేర్ చదువుకున్నావు .. ఈ రెండింటిపై నీకు మంచి అవగాహన ఉండటం వలన ఇది సాధ్యమైంది. నీకు బిగ్ బిగ్ బిగ్ కంగ్రాచ్యూ లేషన్స్. నాకు తెలుసు నీ గోల్ ను నువ్వు చేరుకుంటావని.

ఎలాగైనా తెలుగులో ఒక ఓటీటీ ఛానల్ పెట్టాలి అనే ఆలోచన నుంచి .. లైఫ్ లో కొంచెం 'ఆహా' ఉండాలి నుంచి .. అక్కడి నుంచి నెంబర్ వన్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా వెళ్లి .. ఇప్పుడు ఎక్కడ ఉందంటే నేనిక మాటల్లో చెప్పను .. పోస్టర్లో చూడవలసిందే" అంటూ పోస్టర్ ను చూపించారు.



Tags:    

Similar News