ఈ రోజు సాయంత్రం మిలిటరీ మాధవరంలో జరిగిన నా పేరు సూర్య ఆడియో రిలీజ్ లో చాలా కాలం తర్వాత ఇంకా చెప్పాలంటే మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. చెప్పను బ్రదర్ ఇష్యూ తర్వాత చాలా సార్లు పవన్ ప్రస్తావన దాటవేస్తూ వచ్చిన బన్నీ ఈ రోజు ఇన్నాళ్ళ మౌనానికి సమాధానం కూడా చెప్పేసాడు. ముందు సినిమా గురించి చెప్పిన బన్నీ అసలు మిలిటరీ మాధవరం అనే పేరుందని తెలియదని దర్శకుడు వక్కంతం వంశీ చెప్పగానే ఇక్కడే చేయాలనీ డిసైడ్ చేసుకున్నట్టు చెప్పాడు. కాసేపు సినిమా ముచ్చట్లు అయ్యాక పర్సనల్స్ లోకి వచ్చేసాడు. నాకనిపించలేదు కాబట్టే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నానన్న బన్నీ కోట్లాది రూపాయల ఆదాయం బంగారం లాంటి జీవితాన్ని వదిలేసి జనం కోసం వచ్చిన పవన్ పాలిటిక్స్ లోకి వచ్చాక వ్యక్తిగతంగా ఎటాక్ చేయటం సహజమే అన్నాడు.
ఎన్నో ఏళ్ళ క్రితం ప్రజారాజ్యం టైంలోనే చిరంజీవి గారి గురించి విన్నప్పటి నుంచి గుండె మొద్దుబారిపోయిందన్న బన్నీ ఇప్పుడు పవన్ వచ్చాడు కాబట్టి ఎవడెవడో వచ్చి ఛానల్ ఉంది కదా అని మాట్లాడుతున్నాడు మన ఖర్మ అని బన్నీ అన్నప్పుడు సభ హోరెత్తిపోయింది. ఏదో మాట్లాడుతున్నారు కాని మొన్న చాలా పర్సనల్ గా మాట్లాడారు-మాట్లాడించారు అది చాలా తప్పని చెప్పిన అల్లు అర్జున్ నాకది నచ్చలేదు అని తనదైన స్టైల్ లో చెప్పడంతో ఫాన్స్ ఈలలు కేకలు మారుమ్రోగాయి. వెలిగించింది అగ్గి పుల్లే అయినా పెట్రోల్ ట్యాంక్ ది తప్పని మొత్తం సర్వ నాశనం చేస్తోందని మీడియా ఛానల్స్ ని ఉద్దేశించి అన్నాడు బన్నీ. ఇది తనకు నచ్చలేదు అని మళ్ళి నొక్కి చెప్పిన బన్నీ చివర్లో రంగస్థలం ఘన విజయానికి రామ్ చరణ్ కి విషెస్ చెప్పడంతో ముగించాడు.
మొత్తానికి చాలా స్పష్టంగా తన మనసులో ఉన్నది చెప్పేసి గ్యాప్ ని నింపే ప్రయత్నంలో బన్నీ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. స్పీచ్ కేవలం పది నిమిషాలే అయినా సినిమా గురించి ఐదు నిముషాలు మాట్లాడి మిగిలిన సమయం మొత్తం పవన్ గురించి మెగా ఫ్యామిలీ గురించి చెప్పడం గమనార్హం. ప్రీ రిలీజ్ 29న ఎలాగూ హైదరాబాద్ లో ఉంది కనక వచ్చిన వాళ్ళంతా పొదుపుగా మాట్లాడ్డం విశేషం.