చిరు వేసిన రోడ్లో కార్ తోలుతున్నాం

Update: 2016-04-11 03:42 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు ఆడియో విజయోత్సవ వేడుకలో.. బోలెడన్ని కబుర్లు చెప్పాడు. తనకు ఆర్కే బీచ్ అంటే చాలా ఇష్టమని.. ఆర్య సినిమా చేసేటప్పుడు ఇక్కడ ఓ భారీ ఫంక్షన్ చేయాలని అనుకున్నానని.. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరిందని చెప్పాడు బన్నీ.

మెగాస్టార్ చిరంజీవి పై తన అభిమానాన్ని, ప్రేమను వీలైనంత తక్కువ మాటలతో ఎక్కువ అర్ధం వచ్చేలా చెప్పేందుకు ప్రయత్నించాడు బన్నీ. 'ఇవాళ నేనీ ప్లాట్ ఫాం పై నుంచున్నానంటే..  నేనే కాదు.. పవర్ స్టార్ - మెగా  రామ్ చరణ్ - సాయిధరం తేజ్ - వరుణ్ తేజ్ - శిరిష్.. ఇలా ఇంకెవరైనా సరే ఈ ప్లాట్ ఫాంపై నుంచున్నామంటే.. నిలబడ్డామంటే కారణం.. మెగాస్టార్ చిరంజీవి. ఆయన వేసిన రోడ్ పై మేం కార్ తోలుతున్నామంతే. కార్ తోలేవాడు గొప్పోడు కాదు.. రోడ్ వేసినోడే గొప్పోడు' అంటూ చిరుపై విశ్వాసాన్ని - అభిమానాన్ని వెల్లడించాడు బన్నీ.

సరైనోడు సినిమా చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాడు బన్నీ. ఈ సినిమా తనకు అవసరం కాదని.. కానీ కేరక్టర్ పరంగా తమకే అవసరం అయినా.. ఈ పాత్ర చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు బన్నీ. ఇతర రాష్ట్రాల్లో హీరోగా చేస్తూ.. ఇక్కడ పవర్ ఫుల్ విలన్ గా ఆది నటించాడని.. ఆది - తను కలిసి కరాటే నేర్చుకున్నామని, చెన్నైలో కలిసి పెరిగామని.. చిన్నప్పటి విశేషాలు కూడా చెప్పాడు అల్లు అర్జున్.

ఈ మూవీలో విలన్ కేరక్టర్ - ఆటిట్యూడ్ - పొగరు బాగుంటాయన్న బన్నీ. వేరే భాషలో వేరే హీరో చేస్తే.. ఈ విలన్ గా చేస్తానికి తాను రెడీ అని ప్రకటించాడు. ఇక 'హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఎంత అంతగత్తో అంత తెలివైంది. ఎంత తెలివైందో అతం మంచిది రకుల్, అలాగే స్పెషల్ సాంగ్ చేసిన అంజలికి థ్యాంక్స్' అన్నాడు బన్నీ.

ఇప్పటివరకూ డైరెక్టర్ బోయపాటికి మాస్ డైరెక్టర్ అని ఇమేజ్ ఉందని.. సరైనోడు తర్వాత ఆల్ రౌండర్ డైరెక్టర్ అనిపించుకుంటాడని చెప్పాడు. టోటల్ గా తమ సినిమా ఊర మాస్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ సరైనోడు అని చెప్పి.. టైటిల్ సాంగ్ కి ఓ స్టెప్ వేసి మరీ ఫ్యాన్స్ ని అలరించాడు స్టైలిష్ స్టార్.
Tags:    

Similar News