మెగాస్టార్ ఫొటో వుండాలంటున్న బన్ని

Update: 2015-11-02 04:26 GMT
ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక సందర్భంగా నాగబాబు.. చిరంజీవి వేసిన పూల బాటలో ఇప్పుడున్న మెగా హీరోలంతా నడుస్తున్నారని పవర్ స్టార్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. పవన్ ను మెగా కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్ కు పిలుస్తాం. కానీ వాడు రాడు. మీరే వాణ్ని అడగండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి ఈ మాటలు పవన్ చెవిన పడినట్టున్నాయో ఏమో... ఆ మరుసటి రోజే... స్టార్ హోటల్లో నిర్వహించిన చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పవన్ పాల్గొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ తరువాత కూడా మేమంతా ఒకటే అంటూ బ్రూస్ లీ విడుదల సందర్భంగా పవన్ వద్దకు చెర్రీ వెళ్ళడం.. ఆ తరువాత పవన్ వచ్చి చిరంజీవిని కలవడం వెనువెంటనే జరిగిపోయాయి. దీనిని బట్టి... చిరంజీవి కుటుంబం అంతా ఒకే తాటిపై వుందనే సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు అనిపించింది.

తాజాగా బన్ని కూడా ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో వేడుక అయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలొచ్చిన బన్ని అభిమానులతో పర్సనల్ గా ఫొటోలు దిగారు. సుమారు 300 మందితో ఒక్కొక్కరితో పర్సనల్ గా ఫొటోలు దిగాడు బన్ని. ఈ సందర్భంగా తన అభిమానులకు స్ట్రిక్టుగా పాటించాలని ఓ సూచన చేశాడట. అది ఏంటంటే... ఇక ముందు నుంచి తన పేరుతో ఎవరు బ్యానర్లు కట్టినా... దానిపై కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి ఫొటోతో పాటు ఇతర మెగా కుటుంబం హీరోల ఫొటోలు కూడా ముద్రించాలని చెప్పాడట. బన్ని యూత్, బన్ని ఫ్యాన్స్ అసోషియేషన్ ఇలా.. ఎలాంటి ఏ బ్యానర్లు తన పేరిట వెలిసినా... అందులో కంపల్సరీగా మెగాస్టార్ ఫొటో మాత్రం కచ్చితంగా వుండాలని అభిమానులనులకు స్పష్టం చేశాడట. మరి ఈ సూచనల వెనుక మర్మం ఏంటో.. బన్ని అభిమానులకు అర్థమయ్యే వుంటుంది.
Tags:    

Similar News